Prabhas : ప్రభాస్.. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్..

డార్లింగ్ లిస్ట్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అల్ట్రా బిగ్ సినిమాలున్నాయి. వాటిలో రెండు పాన్ వరల్డ్ టార్గెట్ సెట్ చేసుకుంటున్నాయి. మిగిలినవి ప్రస్తుతానికైతే................

Prabhas :  ప్రభాస్.. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్..

Prabhas

Prabhas :  రాధేశ్యామ్ నిరాశపెట్టినా ఇక తగ్గేదేలే అన్నట్టు రెడీ అవుతున్నారు ప్రభాస్. తన లిస్ట్ లో ఉన్న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్సట్రేషన్ పెంచేసారు. డార్లింగ్ లిస్ట్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అల్ట్రా బిగ్ సినిమాలున్నాయి. వాటిలో రెండు పాన్ వరల్డ్ టార్గెట్ సెట్ చేసుకుంటున్నాయి. మిగిలినవి ప్రస్తుతానికైతే పాన్ ఇండియాగా రెడీ అవుతున్నాయి. అవి సైతం ఫ్యూచర్ లో గ్లోబల్ హాట్ లిస్ట్ లో చేరినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా ప్రభాస్ 4 సినిమాలపై 1500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేలా రెడీఅయ్యారు మేకర్స్.

ప్రస్తుతం ఆదిపురుష్ అప్ డేట్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నేషనల్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కాబోతుండటమే. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ ను ఇంగ్లీష్ తో పాటూ మొత్తం 15 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత భూషణ్ కుమార్ ప్రకటించాడు. ఈ విషయమై ప్రస్తుతం పెద్ద పెద్ద హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపాడు. ఈ లెక్కన ఆదిపురుష్ ప్రభాస్ లిస్ట్ లో ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా మొత్తం 25వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. రాముడిగా ప్రభాస్ విశ్వరూపాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో చూడబోతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియెన్స్ పై వరుసగా ప్రమోషన్ స్టఫ్ వదలబోతున్నాడు డైరెక్టర్ ఓంరౌత్.

2023 సమ్మర్ లో సలార్ రానుంది. కేజీఎఫ్ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఎంతో ప్రిస్టీజియస్ గా సలార్ ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు 35శాతం మాత్రమే సలార్ షూటింగ్ జరిగింది. ఇక కాంప్రమైజ్ కాకుండా శరవేగంగా సలార్ ను పూర్తి చేయాలని ప్రభాస్, ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యారు. ఈ మూవీ కోసం బరువు తగ్గి స్లిమ్ గా కనిపించేలా డార్లింగ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క మేజర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసమే దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. సముద్ర గర్భంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో చాలా సీన్స్ ను హై టెక్నాలజీతో ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా ఈ షూట్ చేస్తున్నారని సమాచారం.

Prashanth Neel : ప్రశాంత్ నీల్ బర్త్‌డే & KGF2 50 డేస్ సెలబ్రేషన్స్

500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ K కూడా పాన్ వరల్డ్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకుంది. సలార్ తో పాటు ప్రాజెక్ట్ K పై కూడా ఫోకస్ చేస్తున్నారు ప్రభాస్. వెరీ రీసెంట్ గా సలార్ షూట్ వాయిదా కావడంతో ప్రాజెక్ట్ Kతో డార్లింగ్ బిజీ అయ్యారని టాక్. ఇక సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన స్పిరిట్ సెట్స్ పైకెళ్లాల్సి ఉంది. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే. పాన్ ఇండియానా, పావ్ వరల్డా అన్నది త్వరలోనే తేలిపోతుంది. సలార్, ప్రాజెక్ట్ K పూర్తయితే కానీ స్పిరిట్ పనుల్ని స్పీడ్ చేయలేడు ప్రభాస్. ఈలోపు సందీప్ రెడ్డి వంగా రణబీర్ యానిమల్ తో పాటూ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేస్తున్నాడు. మొత్తానికి ఈ సారి మాత్రం తన సినిమాలతో పాన్ వరల్డ్ పై గురి పెట్టాడు డార్లింగ్.