Chiranjeevi: మెగాస్టార్ కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ...

Chiranjeevi: మెగాస్టార్ కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్

Prabhu Deva To Choreograph A Song For Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ రోజునే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద కోలుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక వసూళ్ల పరంగా తొలిరోజు పర్వాలేదనిపించినా, తొలి వారాంతం ముగిసే సరికి కలెక్షన్లు మరింత డ్రాప్ అయ్యాయి. ఇక ఆచార్య ఫీవర్ నుండి బయటకు వచ్చిన మెగాస్టార్, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

Chiranjeevi : సత్యదేవ్‌కి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’లో రోల్ లీక్..

ఇప్పటికే ఆయన వరుసబెట్టి మూడు సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ఓ పెప్పీ సాంగ్ కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేయనున్నాడు.

God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?

చిరు గ్రేస్ మూమెంట్స్‌కు ఇప్పుడు ప్రభుదేవా ఈజ్ తోడైతే, ఆ డ్యాన్స్ స్టెప్పులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి చిరంజీవి కోసం ప్రభుదేవా ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తాడా.. అవి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మరో విశేషమేమిటంటే.. ఈ పాటలో చిరుతో పాటు సల్మాన్ ఖాన్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడట. ఇప్పుడు ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో గాడ్‌ఫాదర్ చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు లుక్ సరికొత్తగా ఉండబోతుండగా, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అందాల భామ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.