Prashanth Neel : పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళినే.. ఆయనే మాకు దారి వేశారు..

ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ''మేము ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగు సినిమా తీశారు అన్నంత రెస్పాన్స్ చూపించారు. కైకాల సత్యనారాయణ అనే లెజెండ్ పేరు పెట్టుకొని....

Prashanth Neel : పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళినే.. ఆయనే మాకు దారి వేశారు..

Prashanth

Updated On : April 12, 2022 / 7:24 AM IST

KGF 2 :  యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కెజిఎఫ్’ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ‘కెజిఎఫ్’ సినిమాతో కన్నడ నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. ‘కెజిఎఫ్ 2’ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న ‘కెజిఎఫ్ 2’ సినిమాని తెలుగులో కైకాల సత్యనారాయణ పేరుతో వారాహి చలన చిత్రం వారు రిలీజ్ చేస్తున్నారు.

KGF 2 : రికార్డులనేవి ఒక బాధ్యత.. ‘కెజిఎఫ్ 2’ హైదరాబాద్ ప్రెస్‌మీట్‌లో యశ్

తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ”మేము ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగు సినిమా తీశారు అన్నంత రెస్పాన్స్ చూపించారు. కైకాల సత్యనారాయణ అనే లెజెండ్ పేరు పెట్టుకొని చేస్తున్నాము అంటే అంతే చాలా భాద్యతగా సినిమాని చేశాము. ఇండియన్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళి పేరే చెప్పాలి. పాన్ ఇండియా సినిమా అంటేనే రాజమౌళి. ప్రాంతీయ సినిమాలకి దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న దారిని పెద్ద హైవేగా మార్చారు రాజమౌళి. నా టీమ్ లేకపోతే నేను లేను. ఈ సినిమా కోసం నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ తెలిపారు.