Karnataka : పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింత సాంప్రదాయం … ఎక్కడో తెలుసా..

పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింతసాంప్రదాయం కేరళ,కర్ణాటకలలో ఉంది. దీనికి ప్రేత కళ్యాణం అనిపేరు.

Karnataka : పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింత సాంప్రదాయం … ఎక్కడో తెలుసా..

Pretha Kalyanam

Karnataka :  పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింతసాంప్రదాయం కేరళ,కర్ణాటకలలో ఉంది. దీనికి ప్రేత కళ్యాణం అనిపేరు. ఇటీవల 30 ఏళ్ల క్రితం చనిపోయిన వారికి పెళ్లి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఒక ట్విట్టర్ యూజర్ వీడియోలతో సహా తన ఖాతాలో పోస్ట్ చేశాడు.

సాధారణ వివాహాలకు జరిగినట్లే ఈవివాహ తంతు ఉంటుంది. దక్షిణ కన్నడ సంప్రదాయం ప్రకారం చిన్నప్పుడే చనిపోయిన పిల్లలకు వారి తల్లిదండ్రులు 30 ఏళ్ల తర్వాత ఈ పెళ్లి తంతు నిర్వహిస్తారు. కర్ణాటకలోని మంగుళూరులో ఈనెల28న ఇలాంటి వివాహం ఒకటి జరిగింది.  దీని కోసం పెళ్లి కావాల్సినవారిద్దరికీ ఈడు, జోడు కూడా చూస్తారు. చిన్నప్పుడే మరణించిన మగ పిల్లాడికి సరైన ఈడు, జోడు ఉండి చిన్నప్పుడే చనిపోయిన ఆడ పిల్ల కుటుంబాన్ని ఎంచుకుంటారు.

ఇరు కుటుంబాలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకుని సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. పెళ్లి ముహుర్తాలు నిర్ణయించుకున్న అనంతరం వేడుకగా పెళ్లి తంతు జరిపిస్తారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి వేదికపై రెండు ఖాళీ కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వధువు కుటుంబం పట్టుచీర, వరుడి కుటుంబం ధోవతిని ఆ కుర్చీలలో ఉంచుతారు. ఆ దుస్తులు వధూవరులిద్దరూ ధరించేందుకు వీలుగా అన్నట్లు కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాత చీర కొంగును, పంచెకు ముడి వేస్తారు. ఏడు అడుగుల బంధానికి శ్రీకారంగా ఆ దుస్తులను కుర్చీల చుట్టూ ఏడుసార్లు తిప్పుతారు.

ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జరుగుతుంది. దీని తర్వాత వధువరుల స్థానాలను మార్చుతారు. ఈ పెళ్లి తంతులో ఇరు కుటుంబాల వారు, బంధువులు జంటను ఆట పట్టిస్తారు. వారిపై జోకులు కూడా వేసుకుంటారు. అందరి ఆశీర్వాదం కోసం వధువరులను బయటకు తీసుకు వస్తారు. చివరకు వధువును వరుడి కుటుంబానికి అప్పగించే అప్పగింతల కార్యక్రమంతో ఈ వింత పెళ్లి ముగుస్తుంది. అనంతరం మాంసాహారంతో విందు భోజనం పెడతారు. అయితే ఈ రకంగా జరిగే పెళ్లికి పిల్లలు, పెళ్లి కాని వారిని అనుమతించరు. 30 ఏళ్ల కిందట చిన్నప్పుడే చనిపోయిన చందప్ప, శోభ అనే వారి పెళ్లిని ఈ నెల 28న ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. ఈ పెళ్లి తంతు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.