Prithviraj Sukumaran : ‘సలార్‌‍’లో మలయాళం స్టార్ హీరో.. ప్రెస్‌మీట్‌లో లీక్ చేసిన ప్రభాస్

ప్రెస్ మీట్ లో ప్రభాస్ అనుకోకుండా తన నెక్స్ట్ సినిమా గురించి లీక్ చేశారు. ప్రభాస్ 'రాధేశ్యామ్' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై..

Prithviraj Sukumaran : ‘సలార్‌‍’లో మలయాళం స్టార్ హీరో.. ప్రెస్‌మీట్‌లో లీక్ చేసిన ప్రభాస్

Salaar

 

Prithviraj Sukumaran :  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా మార్చ్ 11న రిలీజ్ అవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు. ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా కేరళలో మలయాళ వర్షన్ కి సంబంధించి ప్రమోషన్స్ ని నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ కేరళలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్ అనుకోకుండా తన నెక్స్ట్ సినిమా గురించి లీక్ చేశారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు ప్రభాస్ కేరళ ప్రెస్ మీట్ లో తెలిపాడు. దీంతో ‘సలార్’ గురించి ఇంత ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ప్రభాస్ అనుకోకుండా లీక్ చేశాడు.

Aishwaryaa Rajinikanth : మరోసారి ఆస్పత్రిపాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య

అయితే పృద్విరాజ్ ‘సలార్’లో ఎలాంటి పాత్ర చేయనున్నాడు? విలన్ పాత్ర లేకా ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టరా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ న్యూస్ తో ‘సలార్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటదో చూడాలి అంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.