Priya Prakash : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకుంది..

ఒక్క స్మార్ట్ ఐడియాతో మళ్లీ వరుసగా సినిమాలతో బిజీ అయిపోయింది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్..

Priya Prakash : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకుంది..

Priya Prakash

Priya Prakash: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలంటోంది ఈ స్మార్ట్ హీరోయిన్.. డిమాండ్ ఉన్నప్పుడు ఫుల్‌గా డబ్బులు వసూల్ చేసిన ఈ వింక్ బ్యూటీ.. సినిమాలు తగ్గడంతో స్మార్ట్ డెసిషన్ తీసుకుంది. ప్రియా వారియర్ కెరీర్‌నే మార్చిన ఆ స్మార్ట్ ఐడియా ఏంటో మనం కూడా చూద్దాం.

Evaru Meelo Koteeswarulu : రామ్ – భీమ్ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీ..!

జస్ట్ కన్నుకొట్టి.. సినిమాల్లో బిజీ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఈ హీరోయిన్ లైఫ్‌ని లైమ్ లైట్లోకి తెచ్చేసింది. ఈ సీన్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వింక్ బ్యూటీ వరుసగా అవకాశాల్ని అందిపుచ్చుకుంది. సౌత్‌లో వరసగా సినిమాలు చేస్తున్న ప్రియా.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో అంటే.. దాదాపు అరకోటి తీసుకుంది.

Deepika Padukone : హాలీవుడ్‌లో బిజీ అవుతున్న బాలీవుడ్ భామ..

ప్రియా ప్రకాష్ ఎంత అడిగితే అంత ఇచ్చి మరీ సినిమాల్లో బుక్ చేసుకున్నారు మేకర్స్. సినిమా అయితే చేసింది కానీ సక్సెస్ మాత్రం అందించలేకపోయింది. రెమ్యునరేషన్ హై గా ఉండడం, సక్సెస్ కూడా పెద్దగా లేకపోవడంతో అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి ఈ యంగ్ హీరోయిన్‌కి. అయితే ఒక్క స్మార్ట్ ఐడియాతో మళ్లీ వరుసగా 3 సినిమాలతో బిజీ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నానంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Priya Prakash Varrier? (@priya.p.varrier)

ఒకప్పుడు 40 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రియా.. ఇప్పుడు పాతిక లక్షలకైనా ఓకే అంటోంది. డిమాండ్ ఉన్నప్పుడు బాగా వసూల్ చేసిన ఈ భామ.. ఛాన్సులు లేనప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకుని చేతినిండా సినిమాలు సంపాదించుకుంది. ఎక్కువ డిమాండ్ చేసి తక్కువ సినిమాలు చెయ్యడం కంటే.. తక్కువ తీసుకుని ఎక్కువ సినిమాలతో అటు ఫేమ్, ఇటు నేమ్‌తో కంటిన్యూ అవ్వొచ్చని డిసైడ్ అయ్యింది.