Deepika Padukone : హాలీవుడ్‌లో బిజీ అవుతున్న బాలీవుడ్ భామ..

ఇప్పటికే హాలీవుడ్‌లో ‘ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ సినిమాలో విన్ డీజిల్‌తో నటించిన దీపికా.. మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన‌ర్‌కి ఓకే చెప్పింది..

10TV Telugu News

Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా .. ఇప్పుడు బాలీవుడ్‌లోనే బిజియెస్ట్ హీరోయిన్. చిన్నా పెద్దా, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిజీగా ఉన్న ఈ టాప్ హీరోయిన్ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ హాలీవుడ్‌లో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సారి మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పడంతో పాటు కొత్త రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకుంటోంది.

Deepika Padukone : డార్లింగ్ సినిమాకు దీపిక కష్టాలు..?

దీపికా పదుకోన్ బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్‌ఫామ్‌లో ఉంది. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు విమెన్ ఓరియంటెడ్, హిస్టారికల్ మూవీస్‌తో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తోంది. ఈ సారి బాలీవుడ్, టాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సినిమాలు కూడా తన లిస్ట్‌లో యాడ్ చేసుకుంది దీపికా.

Deepika Padukone : దీపిక ధగధగలు.. వీడియో వైరల్..

ఇప్పటికే హాలీవుడ్‌లో ‘ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ సినిమాలో విన్ డీజిల్‌తో నటించిన దీపికా.. మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన‌ర్‌కి ఓకే చెప్పింది. ఎస్‌టి‌ఎక్స్ ఫిల్మ్స్ అండ్ టెంపుల్ హిల్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దీపికా సొంత బ్యానర్ అయిన.. కా ప్రొడక్షన్ హౌజ్ కూడా కో ప్రొడ్యూస్ చేస్తోంది.

Xxx Return Of Xander Cage

ఆల్రెడీ దీపికా షారూఖ్ ఖాన్ చేస్తున్న ‘పఠాన్’ సినిమాతో పాటు సిధ్దాంత్ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి శకున్ బాత్రా డైరెక్షన్లో మరో సినిమాలో బిజీగా ఉంది. దీపికా అటు బాలీవుడ్‌లో బిజీగా ఉండటమేకాదు.. టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తోంది. దీపికా పదుకోన్ లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాన్ వరల్డ్ మూవీ చెయ్యడానికి రెడీ అవుతోంది.