Deepika Padukone : డార్లింగ్ సినిమాకు దీపిక కష్టాలు..?

పాన్ వరల్డ్ ప్రాజెక్ట్... తెలుగులో దీపికా డైరెక్ట్ ఎంట్రీ.. అమితాబ్, ప్రభాస్ సెన్సేషనల్ కాంబో.. ‘మహానటి’ డైరెక్టర్.. ఇంత స్టార్ సపోర్ట్ ఉన్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడుతూనే ఉంది. అయితే ఈ సినిమా కారణంగా దీపికా డేట్స్ వేస్ట్ అయిపోయాయి..

Deepika Padukone : డార్లింగ్ సినిమాకు దీపిక కష్టాలు..?

Deepika Padukone

Deepika Padukone: పాన్ వరల్డ్ ప్రాజెక్ట్… తెలుగులో దీపికా డైరెక్ట్ ఎంట్రీ.. అమితాబ్, ప్రభాస్ సెన్సేషనల్ కాంబో.. ‘మహానటి’ డైరెక్టర్.. ఇంత స్టార్ సపోర్ట్ ఉన్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడుతూనే ఉంది. అయితే ఈ సినిమా కారణంగా దీపికా డేట్స్ వేస్ట్ అయిపోయాయి. చేసేదేమీ లేక జూలై నెలను ఎలా ప్లాన్ చేసుకోవాలా అని ఇప్పటినుంచే ఆలోచిస్తుందీ బీటౌన్ బ్యూటీ.

కరోనా కష్టాలు ప్రభాస్ సినిమాలను వెంటాడుతున్నాయి. ప్రభాస్‌తో పాటే హీరోయిన్స్ కూడా ఆ సమస్యను ఫేస్ చేయక తప్పట్లేదు. ప్రభాస్ – దీపికా పదుకొనే కాంబినేషన్‌లో నాగ్ అశ్విన్ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేసాడు. వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ ఈ ఫిల్మ్‌కు హైలైట్ కానుంది. ఇదే సినిమాలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నెక్ట్స్ ఇయర్‌కి పోస్ట్ పోన్ అయింది. ముందు ఈ ప్రాజెక్ట్ కోసం దీపిక పదుకోనే ఈ ఏడాది జులై నుంచి డేట్స్ అడ్జస్ట్ చేసింది. కానీ ఇప్పుడవి వేస్ట్ అయిపోయాయి.

ఇండియన్ వైడ్ రిలీజ్‌తో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. అంటే ప్రభాస్ – దీపికా ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు నాగ్ అశ్విన్. జూలైలో సాధ్యమయ్యేలా లేదు అక్టోబర్‌లో సెట్స్ కెళ్దామనుకున్నారు యూనిట్. కానీ కొవిడ్ తగ్గినా వచ్చే ఏడాదికే షిఫ్ట్ చేద్దామంటున్నారట నాగ్ అశ్విన్. ప్రీ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. హడావుడిగా స్టార్ట్ చేసి మమ అనిపించే ఉద్దేశ్యం తనకు లేదని చెప్తున్నారట నాగ్ అశ్విన్. లేటయినా ఎంత క్లాసిక్‌గా నాగ్ అశ్విన్ రాగలరో ‘మహానటి’ ప్రూవ్ చేసింది కాబట్టి.. ప్రభాస్ – దీపికా కూడా ఓకే అంటున్నారని టాక్.

నాగ్ అశ్విన్ – ప్రభాస్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అంతా ఓకే కానీ, డేట్స్ విషయంలో దీపికానే ఇబ్బంది పడుతోంది. ఆల్రెడీ ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి చేస్తోన్న ‘83’, ‘సర్కస్’ సినిమాల షూటింగ్ పూర్తి చేసేసింది.. షారుక్ ఖాన్ ‘పఠాన్’ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. శకున్ బత్రా డైరెక్షన్లో ఓ మూవీ, అమితాబ్‌తో ‘ది ఇంటర్న్’ రీమేక్, అజయ్ దేవగణ్‌తో ‘మ్యాగ్నమ్ ఓపస్’, మధు మంతెన డైరెక్షన్లో ‘ద్రౌపది’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. ఇలా ఇవన్నీ ఫిల్మింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. నాగ్ అశ్విన్ కరెక్ట్‌గా ఫిక్స్ చేయకపోతే ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న దీపిక ప్రాబ్లమ్ ఫేస్ చేయక తప్పదు..