Lakhimpur Kheri : హౌస్ అరెస్టు చేసిన గదిని ఊడ్చిన ప్రియాంక గాంధీ

స్థానికంగా ఉన్న గెస్ట్ హౌజ్ లో బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్ లో అయిదు గంటల పాటు ప్రియాంకా గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు.

Lakhimpur Kheri : హౌస్ అరెస్టు చేసిన గదిని ఊడ్చిన ప్రియాంక గాంధీ

Priyanka gandhi

Priyanka Gandhi : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఈ క్రమంలో…కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ..మృతుల కుటుంబాలను పరామర్శించడానికి లఖింపూర్ ఖేరికి బయలుదేరి వెళ్లారు.

Read More: IPL 2021 : నిప్పులు చెరిగే బంతులు, ఉమ్రాన్ బుల్లెట్ వేగం

అయితే..అమెను పోలీసులు అడ్డుకున్నారు. సీతాపూర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి…స్థానికంగా ఉన్న గెస్ట్ హౌజ్ లో బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్ లో అయిదు గంటల పాటు ప్రియాంకా గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు. అయితే…ఆ గదిని ఆమెనే స్వయంగా శుభ్రం చేసుకున్నారు. చీపురు అందుకుని శుభ్రం చేసిన అనంతరం నిరాహార దీక్ష చేపట్టారు. బంధించిన గదిని ఊడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గెస్ట్ హౌజ్ రూమ్ శుభ్రంగా లేదని..అందుకే ఆమె ఆ రూమ్ ను క్లీన్ చేసినట్లు కొందరు వెల్లడిస్తున్నారు. అరెస్టు చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు వారెంట్ చూపించాలంటూ..డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీ, దీపేందర్ హుడాలపై పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్ ఖండించింది.