KGF 3 Update : కేజీఎఫ్ 3 అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
2025లో ‘కేజీఎఫ్ -3’ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నట్టు రివీల్ చేశారు నిర్మాత విజయ్ కిరంగదూర్. 2026లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపాడు. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే............
KGF 3 Update : కన్నడ రాక్ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ కాంబోలోని ‘కేజీఎఫ్’ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 మూవీ లాస్టియర్ రిలీజయి కొత్త రికార్డు్ల్ని సెట్ చేసింది. దంగల్, బాహుబలి 2 తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇందులో హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. యాక్షన్ సీన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కేజీఎఫ్-2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్-3 ఉండబోతున్నట్టు హింటిచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశారు ప్రశాంత్ నీల్. దాంతో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది.
కేజీఎఫ్ 3 విషయానికొస్తే ఫారెన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కబోతోందని టాక్. రాఖీభాయ్ తన సామ్రాజ్యాన్ని విదేశాల్లో ఎలా విస్తరించాడనే పాయింట్‌తో పవర్ ఫుల్‌గా మూడో భాగాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం, రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతో ‘కేజీఎఫ్ 3’ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Rashmika Mandanna : రష్మికని వాళ్ళ అమ్మ, నాన్న ఏమని పిలుస్తారో తెలుసా??
2025లో ‘కేజీఎఫ్ -3’ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నట్టు రివీల్ చేశారు నిర్మాత విజయ్ కిరంగదూర్. 2026లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపాడు. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే ‘కేజీఎఫ్ -3’ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత తెలిపారు. పార్ట్ 2 చివర్లో కేజీఎఫ్ కు చెందిన మొత్తం గోల్డ్ ను సముద్రంలో విసిరేసి తాను కూడా సముద్రంలోకి దూకేస్తాడు రాకీభాయ్. అక్కడి నుంచి పార్ట్ 3 స్టార్డ్ కాబోతోంది. నిర్మాత విజయ్ ఇచ్చిన అప్డేట్ తో యశ్ అభిమానులతో పాటు సినిమా ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ చెప్పిన సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమా, ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా పూర్తయిన తర్వాత KGF 3 సినిమా ఉండొచ్చు అని తెలుస్తుంది.