Hyd Drugs Case : నిందితులకు రిమాండ్.. తన కొడుకు నిరపరాధి అంటున్న అభిషేక్ తల్లి

ఈ ఘటనలో తన కొడుకు అలాంటి వాడు కాదని అభిషేక్ తల్లి ఉప్పల శారద తెలిపారు. తాము బిజినెస్ పర్సస్ కోసం పబ్ ను రన్ చేయడం జరుగుతోందని, పాత పబ్ లో...

Hyd Drugs Case : నిందితులకు రిమాండ్.. తన కొడుకు నిరపరాధి అంటున్న అభిషేక్ తల్లి

Drug Case Mother

Pudding And Mink Pub : తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. హైదరాబాద్‌ సిటీలో వరుసగా బయటపడుతున్న డ్రగ్స్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రగ్స్ దందాపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా వర్కౌట్ చేస్తుండగా.. ఇంతలోనే హైదరాబాద్‌ నడిబొడ్డున పబ్‌లో డ్రగ్స్‌ పార్టీ జరగడం కలకలం రేపింది. వీవీఐపీల పిల్లలు, సెలెబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొనడం షాక్‌కు గురి చేసింది. డ్రగ్స్‌ తీసుకుంటూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. రాడిసన్‌ హోటల్‌లోని ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్‌ హోటల్‌లోని ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నిందితులు అనీల్ కుమార్, అభిషేక్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో అర్జున్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని కోసం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు గాలిస్తున్నారు.

Read More : Hyd Drugs Case : ఆ లిస్టు తప్పు.. అసలు లెక్క మా దగ్గర ఉంది.. 5 ప్యాకెట్ల కొకైన్ సీజ్

అయితే.. ఈ ఘటనలో తన కొడుకు అలాంటి వాడు కాదని అభిషేక్ తల్లి ఉప్పల శారద తెలిపారు. తాము బిజినెస్ పర్సస్ కోసం పబ్ ను రన్ చేయడం జరుగుతోందని, పాత పబ్ లో ఉన్న సిబ్బంది ఇక్కడున్నారని, వారు చేసిన దానిని తన కొడుకు బాధ్యుడు కాదన్నారు. 145 మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారో పోలీసులు చెక్ చేయాలని, ఏ టేబుల్ మీద ఏం ఉందనే విషయం ఓనర్ కి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఎవరో తెచ్చిన డ్రగ్స్ అందులో ఒక పార్టీ జరిగిందని, 145 నుంచి 150 మంది గెస్ట్ లు వచ్చారని తెలిపారు. తాము ఒక పార్ట్ నర్ గా అభిషేక్ అక్కడకు వెళ్లాడని, తన కొడుకును వేధించడం దుర్మార్గమని ఖండించారు.

Read More : Pudding And Mink : పేరుకేమో ఆయుర్వేదిక్‌ బార్‌.. లోపల జరిగేదే వేరు, బట్టబయలైన నిజస్వరూపం

బంజారాహిల్స్‌లో టైమ్‌ను పట్టించుకోకుండా.. నిబంధనలను పాటించకుండా.. గబ్బురేపుతున్న పబ్‌ పని పట్టారు పోలీసులు. రాడిసన్‌ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ ఇన్‌ మింగ్‌ పబ్‌పై రైడ్‌ చేశారు. పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ అమ్ముతున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. పోలీసులు రైడ్‌ చేసినప్పుడు షుగర్‌ క్యాండీల మాటున, బాత్‌రూమ్‌ల్లో, కిటికీల దగ్గర డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. ఎలాంటి భయం లేకుండా అక్కడికి వచ్చిన వారికి డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖుల పిల్లలందరినీ డ్రింక్స్‌తో పాటు డ్రగ్స్‌ను కూడా సప్లై చేస్తున్నట్టు సమాచారం. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో పాటు.. ఏపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, పలు పార్టీల లీడర్ల కొడుకులు పార్టీలో పాల్గొన్న వారిలో ఉన్నట్లు తేల్చారు పోలీసులు. బంజారాహిల్స్ సీఐ శివచంద్రను… సీపీ ఆనంద్‌ సస్పెండ్ చేయగా, ఏసీపీకి మెమో జారీ చేశారు. కొత్త సీఐగా నాగేశ్వర్‌రావును నియమించారు. గత ఆరేళ్లలో టాస్క్‌ఫోర్స్‌లో నాగేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారు. పలు డ్రగ్స్ రాకెట్లను బట్టబయలు చేశారు నాగేశ్వర్‌రావు.