గోల్డెన్ ఐడియా : బంగారం రేజర్ తో‌ షేవింగ్ చేస్తున్న బార్బర్..ఎగబడుతున్న జనాలు

గోల్డెన్ ఐడియా : బంగారం రేజర్ తో‌ షేవింగ్ చేస్తున్న బార్బర్..ఎగబడుతున్న జనాలు

salon owner using golden razor : కరోనా నష్టాల నుంచి గట్టెక్కటానికి ఎంతోమంది ఎన్నో రకాల యత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో పూనెలోని ఓ సెలూన్ యజమానికి కష్టమర్లను ఆకట్టుకోవటానికి గోల్డెన్ ఐడియా వేశాడు. అందరి షాపుల కంటే తనది డిఫరెంట్ గా ఉండాలనుకన్నాడు. అలాగే తాను కట్టింగ్ చేసే రేజర్ కూడా డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. ఏకంగా రేజన్ ను బంగారంతో తయారు చేయించాడు. బంగారపు రేజర్ తో షేవింగ్ చేయించుకోవటానికి కష్టమర్లు బాగా వస్తున్నారని చెప్పుకొస్తున్నాడు పూణేకు చెందిన అవినాష్ బోరుండియా అనే బార్డర్.

కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవినాష్‌ 80 గ్రామల బంగారంతో రేజర్‌ తయారు చేయించాడు. దీని కోసం రూ.4 లక్షలు ఖర్చు కూడా పెట్టాడు. అంతేకాదు సెలూన్ షాపును కూడా రీమోడల్‌ చేశారు. అక్కడితో ఊరుకోలేదు..స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పద్వాకర్‌తో ఇటీవల సెలూన్‌ షాపును పునఃప్రారంభించాడు.

బంగారానికైనా పబ్లిసిటీ కావాల్సిందే కదా..అందుకే మా షాపుకు వచ్చే కష్టమర్లకు గోల్డెన్‌ రేజర్‌తో కట్టింగ్, షేవింగ్ చేస్తామంటూ ప్రచారం కూడా చేశాడు. బంగారపు రేజర్ తయారీ గురించి అవినాష్ మాట్లాడుతూ..తన షాపుకు కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని సంతోషం వ్యక్తంచేశాడు అవినాష్‌. బంగారం రేజర్‌తో గడ్డం చేయటానికి రూ.100 తీసుకుంటున్నానని తెలిపాడు.