Jana Gana Mana: ముహూర్తం పెట్టేసిన పూరీ-రౌడీ.. గ్యాప్ లేకుండా కుమ్ముడే!
గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ-విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు. ఈ మంగళవారం మధ్యాహ్నం మంచి ముహూర్తం చూసుకుని..

Jana Gana Mana
Jana Gana Mana: గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ-విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు. ఈ మంగళవారం మధ్యాహ్నం మంచి ముహూర్తం చూసుకుని నెక్ట్స్ మిషన్ లాంచ్ చేశారు. ముంబైలో ఘనంగా ఈ మూవీ లాంచ్ వేడుక నిర్వహించారు. పనిలో పనిగా విజయ్ ఫస్ట్ లుక్ తో పాటు హెలికాఫ్టర్ తో రౌడీ హీరో గ్రాండ్ ఎంట్రీ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేలా ఓ వీడియో కూడా వదిలారు. ముంబై జరిగిన ఈ వేడుకకు మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ రామురావు జూపల్లి, సీఈఓ సింగారావు, డైరెక్టర్ వంశీ పైడి పల్లి కూడా హాజరయ్యారు.

Jana Gana Mana1
Vijay Devarakonda: జనగణమన అంటూ యుద్ధంలోకి దూకిన దేవరకొండ
మూవీ ఓపెనింగ్ వేడుకతో పూరీ-రౌడీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చేసినట్లైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు నెక్ట్స్ మిషన్ లాంచ్ చేసినట్లు పూరీ కనెక్ట్స్ ప్రకటించింది. ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారం ప్రకారం లైగర్ తర్వాత జనగణమన ప్రాజెక్ట్ కోసం కంటిన్యూ కాబోతున్నారు పూరీ-రౌడీబాయ్. ఈ అధికారిక ప్రకటన తర్వాత ఏప్రిల్ నుంచే రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా ప్లాన్ వర్కవుట్ చేయబోతున్నారు.

Jana Gana Mana2
Vijay Deavarakonda : ‘లైగర్’ పూర్తి.. నెక్స్ట్ ‘జనగణమన’..??
ముంబైలో అఫీషియల్ లాంచ్ తర్వాత జనగణమన ఫస్ట్ షెడ్యూల్ షూట్ సౌత్ ఆఫ్రికాలో జరుగబోతుంది. అక్కడి లోకేషన్స్ ను సెర్చ్ చేసే పనిని కొన్ని నెలల ముందే ప్రారంభించింది టీమ్. దానికి సంబంధించిన ఫోటోను కూడా ఈమధ్యే ఛార్మీ ట్వీట్ చేసింది. పవన్, మహేశ్ లాంటి స్టార్స్ అనుకున్న పూరీ.. చివరికి తన గ్లోబల్ స్కేల్ సబ్జెక్ట్ జనగణమనలో విజయ్ దేవరకొండను సెట్ చేశారు. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియో బ్యానర్స్ లో చార్మీ, వంశీ పైడిపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Vijay Devarakonda : నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ.. విజయ్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన పూరి
ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లైగర్.. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్ట్ 25న నేషనల్ వైడ్ లైగర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో రౌడీబాయ్ తో ఏర్పడిన మంచి ర్యాపో కారణంగా తన నెక్ట్స్ సినిమాను కూడా విజయ్ తోనే ప్లాన్ చేశారు పూరీ జగన్నాథ్. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత పూరీ ప్రకటించినట్టు మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టేశారు.