Radhe Shyam: ఎక్కడో ఏదో టెన్షన్.. జనవరి 14నే రాధేశ్యామ్ వస్తుందా?

కొత్త ఏడాదిలో అయినా పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. ఒకటిపోయి రెండు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం అని..

Radhe Shyam: ఎక్కడో ఏదో టెన్షన్.. జనవరి 14నే రాధేశ్యామ్ వస్తుందా?

Radhe Shyam

Updated On : January 2, 2022 / 3:09 PM IST

Radhe Shyam: కొత్త ఏడాదిలో అయినా పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. ఒకటిపోయి రెండు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం అని మూడవసారి కూడా ఒమిక్రాన్ అంటూ సిద్ధమైంది కరోనా. మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా సినిమా విషయంలో దీని ప్రభావం ముందు కనిపిస్తుంది. పలు రాష్ట్రాలలో ఆంక్షలతో థియేటర్ల వ్యవహారం మళ్ళీ సీటింగ్ తగ్గించేలా చేసింది. కరోనా విజృంభణ ప్రభావం రెండు నెలల వరకు ఉంటుందనే అంచనాతో విడుదల కావాల్సిన భారీ సినిమాలు వెనక్కు తగ్గాయి.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

ఇండియన్ బిగ్గెస్ట్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎంతో ధీమాగా ఉంటూనే మళ్ళీ వాయిదా పడింది. సంక్రాంతి పోటాపోటీగా వస్తాయనుకున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లలో ఒకటి మిడిల్ డ్రాప్ అవడంతో అందరి చూపు రాధేశ్యామ్ మీదనే పడింది. నో డౌట్ మేము సంక్రాంతికే వస్తాం.. చెప్పినట్లుగానే జనవరి 14నే థియేటర్లలో కలుస్తాం అంటూ రాధేశ్యామ్ మేకర్స్ ఘనంగా ప్రకటిస్తున్నారు. అయితే.. సంక్రాంతి సినీ ప్రేక్షకులు, ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు బయ్యర్లు, డిస్టిబ్యూటర్లలో మాత్రం టెన్షన్ ఆగడం లేదు.

Sankranthi Movies : సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు.. మెగా హీరో సినిమా కూడా

ఇప్పటికే పలు రాష్ట్రాలలో ముఖ్యంగా ప్రభాస్ క్రేజ్ ఉన్న ఉత్తరాదిన కరోనా విజృంభణ ఎక్కువవుతుంది. అందుకే ఆంక్షలు విధిస్తున్నారు. దక్షణాది రాష్ట్రాలలో కూడా త్వరలోనే ఇదే పరిస్థితి రావచ్చని నిపుణుల అంచనా. అందుకే పలు ప్రభుత్వాలు కట్టడి చర్యలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు భారీ మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఏపీ టికెట్ల వివాదం ఇంకా తేలలేదు. దీంతో ఏ క్షణాన ఏ రాష్ట్రం నుండి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని మేకర్స్ లో టెన్షన్ కనిపిస్తుంది.

Kajal Agarwal : తల్లి కాబోతున్న కాజల్.. అధికారికంగా ప్రకటించిన గౌతమ్

ప్రస్తుతానికి రాధేశ్యామ్ జనవరి 14న విడుదల అని ధీమాగానే ఉన్నా జనవరి 7 తర్వాత పరిస్థితిని బట్టి ముందుకా వెనక్కా అనేది ఖరారు చేసుకోనున్నారు. అప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు ఉండవు కానీ.. పునరాలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. విడుదలకు వారం ముందు దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితి.. రాష్ట్రాల ఆంక్షలను బట్టి విడుదల చేయాలా.. వాయిదా వేయాలా అనేది ఖరారు చేసుకోనున్నారు.