Radheshyam : వైరల్ అవుతున్న ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో.. యూరప్‌లో షూటింగ్ కష్టాలు..

తాజాగా 'రాధేశ్యామ్' మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 'రాధేశ్యామ్' సాగా పేరుతో ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో నాలుగేళ్ల్లుగా మూవీ టీమ్............

Radheshyam : వైరల్ అవుతున్న ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో.. యూరప్‌లో షూటింగ్ కష్టాలు..

Radheshyam

Updated On : March 5, 2022 / 7:06 AM IST

Radheshyam :  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. యూరప్ దేశాల్లో, హైదరాబాద్ సెట్స్ లో సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘రాధేశ్యామ్’ మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. తాజాగా ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

‘రాధేశ్యామ్’ సాగా పేరుతో ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో నాలుగేళ్ల్లుగా మూవీ టీమ్ పడిన కష్టం, సినిమాని ఎంత బాగా చిత్రీకరించారో, ఎలా, ఎక్కడెక్కడ చిత్రీకరించారో చూపించారు. యూరప్ లో అందమైన లొకేషన్స్, మంచు లొకేషన్స్, ఆ లొకేషన్స్ లో మూవీ టీమ్ కష్టపడుతూ షూటింగ్ చేయడం, తర్వాత కరోనా రాకతో ఇండియాలో సెట్స్ వేసి షూట్ చేయడం, ఫారెన్ షూటింగ్ షెడ్యూల్స్, ఇటాలీ సెట్, సినిమాకి మ్యూజిక్ అందివ్వడం.. ఇలా అన్ని చూపించారు ఈ మేకింగ్ వీడియోలో.

Yash Master : యశ్ మాస్టర్ ఇల్లు చూశారా??

ఇక షూటింగ్ లో ప్రభాస్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నట్టు చూపించారు. షూటింగ్ మధ్యలో రాజమౌళి రావడం, రాజమౌళితో ప్రభాస్ సరదాగా గడపడం.. ఇవన్నీ కూడా ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండటమే కాక సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.