Yash Master : యశ్ మాస్టర్ ఇల్లు చూశారా??

యశ్ మాస్టర్ కి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక యశ్ అడ్డా పేరుతో యూట్యూబ్ లో ఛానల్ కూడా నడుపుతాడు యశ్. తన ఛానల్ లో తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ...........

Yash Master : యశ్ మాస్టర్ ఇల్లు చూశారా??

Yash

Updated On : March 5, 2022 / 6:45 AM IST

Yash Master :  తెలుగులో ఫేమ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ లో యశ్వంత్ మాస్టర్ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించాడు యశ్ మాస్టర్. డ్యాన్స్‌ షోలో పార్టిసిపేట్ చేస్తూ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారాడు యశ్. తన స్లో మూమెంట్ స్టయిలిష్‌ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సమంత లీడ్ రోల్ లో చేసిన యూటర్న్‌ లో ఒక పాట ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఆ సినిమా తర్వాత యశ్ కి మరింత గుర్తింపు వచ్చి మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.

యశ్ మాస్టర్ కి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక యశ్ అడ్డా పేరుతో యూట్యూబ్ లో ఛానల్ కూడా నడుపుతాడు యశ్. తన ఛానల్ లో తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ అభిమానులకి మరింత దగ్గరగా ఉంటాడు. యశ్‌ తాజాగా తన ఇంటికి సంబంధించిన హోం టూర్‌ వీడియో చేశాడు.

మొదటి రోజు హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే

తన హోమ్ టూర్ వీడియోలో తన ఇంటికి సంబంధించిన పలు విషయాలను నెటిజన్లతో పంచుకున్నాడు. ఇందులో తన ఇల్లు మొత్తం తిప్పి చూపించాడు. తన ఇంట్లో హాల్, బాల్కనీ, తన పర్సనల్ రూమ్, డైనింగ్ హాల్, తనకి ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్స్, తాను డ్యాన్స్ లో గెలుచుకున్న కప్స్, మెమెంటోస్, తన డ్రెస్సులు, బెడ్ రూమ్, కిచెన్, తన ఫ్యామిలీ ఫోటోలు.. ఇలా అన్ని చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.