Rahul Sipligunj : నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. అంతర్జాతీయ స్టేజిపై నా పేరు చెప్పడం గర్వంగా ఉంది..

నాటు నాటు సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ 10 టీవీతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పటివరకు చాలా పాటలు............

Rahul Sipligunj : నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. అంతర్జాతీయ స్టేజిపై నా పేరు చెప్పడం గర్వంగా ఉంది..

Rahul Sipligunj about naatu naatu song getting golden globe award

Rahul Sipligunj :  RRR సినిమా అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతుంది. ఇప్పటికే RRR సినిమాని, దర్శకుడు రాజమౌళిని అందరూ అభినందిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో ఈ సినిమాకి చాలా బాగా పేరొచ్చింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి అయితే ప్రపంచవ్యాప్తంగా ఫిదా అయిపోయారు. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ కి ఫిదా అయ్యారు. ఇప్పటికే నాటు నాటు సాంగ్ ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో చేరింది. హాలీవుడ్ లో పలు అవార్డులు అందుకుంటున్న RRR సినిమా తాజాగా సినిమాలోని నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అందుకుంది. దీంతో దేశమంతా RRR టీంకి, సంగీత దర్శకుడు కీరవాణికి అభినందనలు తెలుపుతున్నారు.

నాటు నాటు పాట సంగీత దర్శకుడు కీరవాణి అత్యంత ప్రతిష్టాత్మిక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న అనంతరం అంతర్జాతీయ వేదికపై మాట్లాడుతూ ఈ పాటకి సహకరించిన అందరికి వారి పేర్లు చెప్తూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ పాటని అద్భుతంగా పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పేర్లు కూడా చెప్పి వారికి థ్యాంక్స్ తెలిపాడు.

దీంతో నాటు నాటు సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ 10 టీవీతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పటివరకు చాలా పాటలు పాడాను. ఇప్పటిదాకా ఒక్క అవార్డు కూడా రాలేదు. ఒక్కోసారి ఈ విషయంలో ఫీల్ అయ్యాను. కానీ దేవుడు ఇలా రాసిపెట్టాడేమో. ఏకంగా నేను పాడిన పాటకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేలా చేశాడు. నేను ఎప్పుడూ నన్ను గల్లీబాయ్ గా పోల్చుకుంటాను. కానీ ఇప్పుడు ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ వేదికపై వినిపించింది. స్టేజిపై కీరవాణి గారు నా పేరు చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి మూమెంట్ వస్తుందో రాదో తెలీదు. ఇది ఎప్పటికి గుర్తుంది పోతుంది. నా వాయిస్ ని అంగీకరించిన కీరవాణి సార్ కి, రాజమౌళి గారికి, RRR టీం అందరికి ధన్యవాదాలు అని తెలిపాడు.

RRR Team at Golden Globe Awards Event : గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకకి ఫ్యామిలీ సమేతంగా RRR యూనిట్..

ఒక సాధారణ బార్బర్ గా కెరీర్ మొదలుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్ తన ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయి ఆ తర్వాత సినిమాల్లో పాటలతో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఏకంగా తను పాడిన పాట నాటు నాటుకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో అంతర్జాతీయ అవార్డు గోల్డెన్ గ్లోబ్ సాధించడంతో అందరూ రాహుల్ ని కూడా అభినందిస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు.