Raja Raja Chora : రాజాదిరాజా.. రాజ పరాక్రమ.. మహా పరిక్రమ, త్రివిక్రమ.. టీజర్ అదిరిందిగా..!

శ్రీవిష్ణు, సునయన, మేఘా ఆకాష్ నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాజ రాజ చోర’ టీజర్ రిలీజ్..

Raja Raja Chora : రాజాదిరాజా.. రాజ పరాక్రమ.. మహా పరిక్రమ, త్రివిక్రమ.. టీజర్ అదిరిందిగా..!

Raja Raja Chora

Raja Raja Chora: హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త సినిమా ‘రాజ రాజ చోర’..

మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌‌ని హసిత్‌గోలి డైరెక్ట్ చేస్తున్నాడు.. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్‌ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

Raja Raja Chora : దొంగకు కూడా రవ్వంత గుర్తింపు కావాలి.. ‘చోర గాథ’ అదిరిపోయిందిగా..

ఇటీవల ‘చోర గాథ’ పేరుతో బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ వాయిస్‌ ఓవర్‌తో విడుదల చేసిన 2డీ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ‘రాజ రాజ చోర’ టీజర్ వదిలారు. దొంగతనాలు చేస్తూ సాఫ్ట్ వేర్ అని బిల్డప్పులిచ్చే క్యారెక్టర్‌లో ఎప్పటిలానే తన స్టైల్ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. కథానాయికలిద్దరితోనూ అతని కెమిస్ట్రీ బాగుంది.

శ్రీవిష్ణుని పట్టుకునే పోలీసు పాత్రలో రవిబాబు కనిపించారు. తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ‘రాజ రాజ చోర’ టీజర్.. సినిమా మీద అంచనాలు పెంచేసింది. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. ఈ సినిమాకి సంగీతం : వివేక్ సాగర్, కెమెరా : వేదరామన్, ఎడిటింగ్ : విప్లవ్ నిషాదం.