RRR : అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’లో నన్ను టార్చర్ పెట్టింది..

రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. ఆలియా, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా ఇత‌ర స్టార్స్‌ గురించి తెలిపారు. నేను డైరెక్టర్‌గా న‌టీన‌టుల భాష, ప్రాంతం గురించి ఆలోచించను. ఆడియెన్స్

RRR : అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’లో నన్ను టార్చర్ పెట్టింది..

Rrr (1)

RRR :  ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కరోనా వల్ల చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ సినిమా. ఇటీవల 2022 జనవరి 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఒక‌వైపు మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు చూస్తూనే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను ప్ర‌మోట్ చేయడం మొదలు పెట్టారు. నిన్న PVR సినిమాస్ తో ప్రమోషన్ డీల్ కుదుర్చుకొని సినిమా రిలీజ్ అయ్యేవరకు పివిఆర్ కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్ ల పేరు PVRRR గా మారుస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా స్టార్ల గురించి మాట్లాడారు.

RRR Glimpse : ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ డేట్, టైం ఫిక్స్

రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. ఆలియా, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా ఇత‌ర స్టార్స్‌ గురించి తెలిపారు. నేను డైరెక్టర్‌గా న‌టీన‌టుల భాష, ప్రాంతం గురించి ఆలోచించను. ఆడియెన్స్ విష‌యంలోనూ అంతే నేను భాషా బేదాలు చూడటం మ‌ర‌చిపోయాను. స్క్రిప్ట్ కూడా అంతే నా స్క్రిప్ట్‌కు భాష‌తో సంబంధం లేకుండా ఏ న‌టుడు అయితే న్యాయం చేయగలుగుతాడు అనుకుంటే ఆ నటుడిని నేను సినిమాలో తీసుకుంటాను అని అన్నారు. RRR లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారు కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న ‘ఈగ’ హిందీ వెర్ష‌న్ డ‌బ్బింగ్ చెప్పారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో అనుబంధం ఉంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌ షూటింగ్ స‌మ‌యంలో ఎప్పుడూ త‌న వ్యాన్‌లో కూర్చోలేదు. బ‌య‌టే కూర్చుని షాట్ ఎలా వ‌స్తుందో గ‌మ‌నించేవారు. ఇక ఆలియా భ‌ట్ అయితే మ‌మ్మ‌ల్ని టార్చ‌ర్ పెట్టేసింది. త‌న డైలాగ్ లైన్స్ గురించి, డిక్ష‌న్ గురించి పూర్తిగా అర్దమయ్యేవరకు మమ్మల్ని అడిగి తెలుసుకునేది. తాను పర్ఫెక్ట్ గా అవుట్ ఫుట్ ఇవ్వడానికి మమ్మల్ని టార్చర్ పెట్టేది. అది మాకు ఇష్టమే. మేము ఆలా టార్చర్ పడితేనే సినిమా బాగా వస్తుంది అన్నారు. ఇక ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ నాకు రెండు ద‌శాబ్దాలుగా తెలుసు. నాకు మంచి స్నేహితులు, సోద‌ర స‌మానులు వారితో ప‌నిచేయ‌డం ఎప్పుడూ నాకు క‌ష్ట‌మ‌నిపించ‌లేదు అని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆర్టిస్టుల గురించి తెలిపారు.

Puneeth Rajkumar : పునీత్ మృతితో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్

ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మరోసారి రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అని తెలిపారు. ఈ సినిమా నుంచి 45 సెకన్ల గ్లింప్స్ ని ఎల్లుండి ఉదయం విడుదల చేయనున్నారు.