Rajamouli : వెంటవెంటనేనా.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై రాజమౌళి స్పెషల్ పోస్ట్..

తాజాగా భారత ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డులలో సంగీత దర్శకులు MM కీరవాణిని ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకి...............

Rajamouli : వెంటవెంటనేనా.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై రాజమౌళి స్పెషల్ పోస్ట్..

Rajamouli special post on Keeravani Regarding Padmashri Award

Rajamouli :  ఇన్నాళ్లు ఎన్నో పాటలని, మధురమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు కీరవాణి RRR సినిమాతో, నాటు నాటు సాంగ్ తో ప్రపంచాన్ని ఊపేస్తున్నారు. RRR సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులని, మ్యూజిక్ లవర్స్ ని నాటు నాటు పాట మెప్పిస్తుంది. ఇన్నాళ్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న కీరవాణి ఇప్పుడు నాటు నాటు సాంగ్ తో వరుస అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్నారు.

RRR సినిమాలో కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ కి అంతర్జాతీయ స్థాయిలో వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఆస్కార్ తర్వాత అత్యున్నత పురస్కారం అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కీరవాణి ఇటీవలే అందుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే సినిమా వాళ్లకు అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ నామినేషన్ లో నాటు నాటు సాంగ్ తో నిలిచారు. దీంతో మరోసారి కీరవాణి పాట ప్రపంచమంతటా వినిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి. కీరవాణి ఆస్కార్ ఎలాగైనా గెలవాలని దేశమంతా కోరుకుంటుంది. దీంతో కీరవాణి ఆనందంలో ఉన్నారు. ఆయన ఆనందాన్ని భారత ప్రభుత్వం మరింత రెట్టింపు చేసింది.

తాజాగా భారత ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డులలో సంగీత దర్శకులు MM కీరవాణిని ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కీరవాణి తమ్ముడిగా, ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకుడిగా మన జక్కన్న రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

MM Keeravani : కూటి కోసం వ్యవసాయం చేసిన దగ్గర్నుంచి.. పద్మశ్రీ, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ నామినేషన్ వరకూ.. కీరవాణి సంగీత ప్రయాణం..

కీరవాణి కాళ్ళ దగ్గర రాజమౌళి కూర్చున్న ఓ ఫొటోని షేర్ చేసి.. మీ అభిమానులలో చాలామంది ఎదురుచూసినట్టే నేను కూడా ఈ గుర్తింపు కోసం ఎదురుచూశాను. కానీ మీరు చెప్పినట్లుగా ఒకరి ప్రయత్నాలకు ప్రపంచం ప్రతిఫలం కచ్చితంగా చాలా చిత్రంగా ఇస్తుంది. నేను ప్రపంచంతో తిరిగి మాట్లాడగలిగితే ఒకటే చెప్తాను కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరోటి ఇవ్వు. నా పెద్దన్న కీరవాణి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నందుకు గర్వంగా ఉంది అని పోస్ట్ చేశారు. వరుసగా ఇటీవల కీరవాణికి అవార్డులు వస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఈ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గామారింది.