Muslim Girl Topper in Sanskrit : సంస్కృతంలో టాపర్ గా నిలిచిన ముస్లిం యువతికి గోల్డ్ మెడల్

Muslim Girl Topper in Sanskrit : సంస్కృతంలో టాపర్ గా నిలిచిన ముస్లిం యువతికి గోల్డ్ మెడల్

Muslim Girl Topper In Sanskrit

Muslim girl topper in Sanskrit : రాజస్థాన్‌లోని సవాయీ మాధేపూర్‌నకు చెందిన ముస్లిం యువతి అస్మత్ పర్వీన్ సంస్కృతంలో టాపర్ గా నిలిచింది. సంస్కృతం వ్యాకరణ ఆచార్యలో గోల్డ్ మెడల్ అందుకోబోతున్న ఏకైక ముస్లిం యువతిగా నిలిచింది అస్మత్ పర్వీన్. బాషకు మతానికి సంబంధం లేదని నిరూపించింది. ఈ ఘన విజయం సాధించిన అస్మత్ పర్వీన్ పరీక్షా కేంద్రానికి ఐదు నిముషాలు లేటుగా వెళ్లింది. అయినా సరే చక్కటి ప్రతిభ కనబరిచి పరీక్షలో టాపర్ గా నిలిచింది.

పరీక్ష రాయటానికి లేట్ గా వెళ్లినందుకు అస్మత్ ను పరీక్ష రాసేందుకు సంబంధిత అధికారులు అభ్యంతరం పెట్టారు. కానీ ఆ తరువాత ఆమెను పరీక్ష రాసేందుకు వెళ్లనిచ్చారు. అస్మత్ పర్వీన్ మదరసాలో చదువుకుంది. ఆమె తండ్రి మంజూర్ ఆలం శివ్రానీ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. దీంతో తన ఏడుగురు పిల్లల్ని చదువుల్లో చక్కటి ప్రోత్సాహాన్నిచ్చి చదివించారు.

మంజూర్ ప్రోత్సాహంతో అతని మూడవ కూతురు అస్మత్ పర్వీన్…మదరసాలో విద్యాభ్యాసం పూర్తిచేసిన తరువాత ప్రైవేటు స్కూలులో చేరింది. తరువాత సంస్కృతం మీద ఇష్టం ఉందని తండ్రితో చెప్పింది. ఓ ముస్లిం అయినాగానీ మంజూర్ ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టముంటే చదువుకోమని ప్రోత్సహించారు. దీంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించటమే కాకుండా టాపర్ గా నిలిచింది.

తరువాత సంస్కృత వ్యాకరణలో ప్రొఫెసర్ కోర్సు కూడా పూర్తి చేసింది. అయితే పరీక్షలకు సమయానికి హాజరు కాలేకపోయింది. 10 నిముషాలు లేటుగా వెళ్లింది. దీంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. అయితే ఎలాగోలా వారిని ఒప్పించి.బతిమాలుకుని 25 నిముషాల అనంతరం పరీక్షకు కూర్చుంది. అయినా సరే ఏమాత్రం కంగారుపడకుండా..సంస్కృత వ్యాకరణలో అస్మత్ పర్వీన్ టాపర్‌గా నిలిచింది. త్వరలో ఆమె యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకోనుంది.