Rajnath Singh: రాహుల్ చైనా గురించి ఏం చదివితే అదే నమ్ముతాడు: రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

చైనా - భారత్ మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో రాహుల్ గాంధీకి స్పష్టత లేదని..ఎక్కడ ఏది చదివినా దాన్నే నిజమనుకుంటున్నాడని..రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.

Rajnath Singh: రాహుల్ చైనా గురించి ఏం చదివితే అదే నమ్ముతాడు: రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

Rajnath

Rajnath Singh: చైనా – భారత్ మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో రాహుల్ గాంధీకి స్పష్టత లేదని..ఎక్కడ ఏది చదివినా దాన్నే నిజమనుకుంటున్నాడని..రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బల్దేవ్ నియోజకవర్గంలో పర్యటించిన రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రజల నుద్దేశించి మాట్లాడారు. ఈసందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇటీవల పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో రాహుల్ చేసిన ప్రసంగంపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. గాల్వాన్ లోయలో చైనా భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు చైనా సైనికులే మరణించారంటూ రాహుల్ చెప్పడం.. స్పష్టత లేని ఆయన విషయపరిజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.

Also read: Parrot Steals GoPro: “గోప్రో కెమెరా”ను దొంగిలించి ఎగిరిపోయిన చిలుక, అద్భుతమైన వీడియో రికార్డ్

గాల్వాన్ ఘర్షణల్లో 35-50 మంది చైనా సైనికులు మృతి చెందారంటూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయని..రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. భారత సైనికులు ధీటుగా ఎదుర్కోవడంతోనే చైనా సైనికులు తోకముడిచారన్న రక్షణ మంత్రి..భారత సైనికుల చర్యలతోనే మన దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉగ్రవాద చర్యలు, చైనా దురాక్రమణలపై గతంలో భారత్ వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టేవని.. కానీ నేడు భారత్ చెప్పే ప్రతి విషయాన్నీ ఇతర దేశాల వారు నిశ్చితంగా పరిశీలుస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ హితవు పలికారు.

Also read: Viral News : చంటిబిడ్డను ఎత్తుకుని..టీవీ లైవ్‌లో రిపోర్టింగ్