NEET PG 2022 Reschedule: నీట్ పీజీ 2022 వాయిదా..మే 21న ఎగ్జామ్

నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్ధనలు మేరకు, కేంద్ర ఆరోగ్యశాఖ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటించింది.

NEET PG 2022 Reschedule: నీట్ పీజీ 2022 వాయిదా..మే 21న ఎగ్జామ్

Neet

NEET PG 2022 Reschedule: నీట్ పీజీ అభ్యర్థులకు కాస్త ఉపశమనం కలిగించే వార్త. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్(NEET PG 2022) దరఖాస్తు తేదీని.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పొడిగించింది. పరీక్షను రీషెడ్యూల్ చేసింది. నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్ధనలు మేరకు, కేంద్ర ఆరోగ్యశాఖ పరీక్షను వాయిదా వేస్తూ శుక్రవారం ప్రకటించింది. అయితే దరఖాస్తు తేదీతో పాటు, పరీక్షా తేదీని మార్చుతూ శుక్రవారం నాడే NBEMS ఈప్రకటన విడుదల చేసింది.

Also read: Cryptocurrency Hacked: $320 మిలియన్ విలువైన క్రిప్టోకరెన్సీని కాజేసిన హ్యాకర్లు

గతంలో ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు గడువు విధించగా.. కొత్త ప్రకటన ప్రకారం దరఖాస్తు గడువును మార్చి 25 వరకు పొడిగించారు. NEET PG 2022 పరీక్షను కూడా మే 21కి రీషెడ్యూల్ చేశారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 16న డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2022 జూన్ 20న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. NEET PG 2022 దరఖాస్తులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకో దలచిన అభ్యర్థుల కోసం దరఖాస్తు సవరణ విండో మార్చి 29 నుండి ఏప్రిల్ 7 వరకు తెరిచిఉంచుతారు. ఫైనల్ ఎడిట్ విండో ఏప్రిల్ 26 నుండి ఏప్రిల్ 30 వరకు తెరిచి ఉంచుతారు. దరఖాస్తు చేయదలుచుకున్న అభ్యర్థులు nbe.edu.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

Also read: Husband For Sale: మొగుడ్ని వేలానికి పెట్టిన భార్య, కొనుకుంటామంటూ వచ్చిన 12 మంది మహిళలు