Orange : జపాన్‌లో ఆరెంజ్ రీ రిలీజ్ సందడి.. వీడియో వైరల్!
రామ్ చరణ్ చిత్రం ఆరెంజ్ రీ రిలీజ్ అయ్యి రెండు రాష్ట్రాల్లో తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జపాన్ లో రీ రిలీజ్ అయ్యింది.

Ram Charan orange movie re released in japan video viral
Orange : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన లవ్లీ మూవీ ఆరెంజ్. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మగధీర వంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ చేసిన ఈ సినిమా అప్పటిలో పెద్ద విజయం సాధించలేక పోయింది. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తెగ సందడి చేస్తుంది. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రలో గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది.
Game Changer : నేషనల్ అవార్డు విన్నర్ స్టంట్ మాస్టర్‌తో రామ్ చరణ్ పోరాటం.. పిక్ లీక్!
ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే, కానీ ప్లాప్ అయిన ఆరెంజ్ మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద ఓరేంజ్ కలెక్షన్స్ అందుకొని రీ రిలీజ్ చిత్రాల్లో రికార్డుగా నిలిచింది. ఇక ఇప్పుడు జపాన్ లో సందడి చేస్తుంది. రామ్ చరణ్ కి ఇండియాతో పాటు జపాన్ లో కూడా సూపర్ ఫ్యాన్‌డమ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక RRR తో జపాన్ లో అభిమానుల సంఖ్య ఇంకొంచెం పెరిగింది. దీంతో ఆరెంజ్ చిత్రాన్ని అక్కడ కూడా రీ రిలీజ్ చేయాలని డిమాండ్స్ రావడంతో నిర్మాత నాగబాబు అక్కడ కూడా రిలీజ్ చేశాడు.
Ram Charan – Samantha : రామలక్ష్మికి చిట్టిబాబు ట్వీట్.. చాలా గర్వంగా ఉంది!
ఆ రీ రిలీజ్ వేడుకలో నాగబాబు కూడా పాల్గొని జపాన్ లోని చరణ్ అభిమానుల సందడిని ఆస్వాదించాడు. థియేటర్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ “We Love Charan” అంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తుంటే నాగబాబు దానిని వీడియో తీసి ఇండియన్ ఆడియన్స్ తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram