Game Changer : నేషనల్ అవార్డు విన్నర్ స్టంట్ మాస్టర్‌తో రామ్ చరణ్ పోరాటం.. పిక్ లీక్!
రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూట్ జరుగుతుంది. మూవీ సెట్స్ లో నుంచి ఒక పిక్ లీక్ అయ్యింది.

Ram Charan Game Changer stunt master Anbariv shares a pic
Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. RRR వంటి గ్లోబల్ సక్సెస్ తరువాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం, అది కూడా శంకర్ వంటి డైరెక్టర్ తో చేతులు కలపడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యినట్లు దిల్ రాజు తెలియజేశాడు. మిగిలిన 30 శాతం షూటింగ్ ఆగష్టు లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Ram Charan : చిరుత కాదు చిట్టెలుక.. రామ్ చరణ్ గురించి బలగం ఫేమ్ నటుడు కామెంట్స్..
తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ మొదలైంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో చరణ్ దాదాపు 1200 మంది ఫైటర్స్ తో పోరాడబోతున్నాడు. ఇక ఈ యాక్షన్ పార్ట్ ని నేషనల్ అవార్డు విన్నర్ అన్బరివ్ డైరెక్ట్ చేస్తున్నాడు. గేమ్ చెంజర్ సెట్ లో గన్ తో ఉన్న తన పిక్ ని షేర్ చేస్తూ ‘గన్స్ లోడెడ్’ అనే క్యాప్షన్ ని పెట్టాడు. సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ కానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇంటర్వెల్ టైంలో వచ్చే సీక్వెన్స్ కూడా అదిరిపోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా ఈ మూవీలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది. వినయ విధేయ రామ సినిమా తరువాత మరోసారి చరణ్ అండ్ కియారా కలిసి నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య ముఖ్య పత్రాలు చేస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.
#Guns #Loaded ❤️??
Power Packed Climax of #GameChanger in Shoot ??Man Of Masses @AlwaysRamCharan ?@anbariv Choreography ?@shankarshanmugh Direction ? pic.twitter.com/hcdmckl85G
— Trends RamCharan™ (@TweetRamCharan) April 25, 2023