Ram Charan: డిస్నీ ప్లస్ బిగ్ ప్లాన్.. అంబాసిడర్‌గా చెర్రీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు భారీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా చక్కబెడుతున్నారు. చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న..

Ram Charan: డిస్నీ ప్లస్ బిగ్ ప్లాన్.. అంబాసిడర్‌గా చెర్రీ!

Ram Charan

Updated On : September 13, 2021 / 1:22 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు భారీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా చక్కబెడుతున్నారు. చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యలో సిద్ద పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ఈ మధ్యనే మరో దక్షిణాది దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో నటించే సినిమా కూడా మొదలు పెట్టాడు.

Sakshi Agarwal: సోకుల గాలమేసి సంపేస్తున్న సాక్షి!

మరోవైపు తండ్రి నటించే ఆచార్య సినిమాకి కూడా చరణే దగ్గరుండి నిర్మాణ బాధ్యతలను చూసుకుంటున్నాడు. కాగా, ఓటీటీలో ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అంటూ ఇప్పుడు తెలుగు కంటెంట్ మీద కూడా ఫోకస్ చేసి ఇక్కడ తన మార్క్ చూపించేందుకు తహతహలాడుతుంది. ఇందులో భాగంగానే తెలుగులో తమ ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు రాలేదు కానీ దాదాపుగా రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది.

Shanvi Srivastava: దివి నుంచి సాగరతీరానికి దిగొచ్చిందా!

ఓటీటీలో తెలుగు మార్కెట్ ఇప్పుడు పెద్దది కావడంతో దాదాపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ఇక్కడ పాగా వేసేందుకు చూస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు దూసుకుపోతుండగా తెలుగు ఓటీటీ ఆహా ప్యూర్ తెలుగు కంటెంట్ అంటూ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే, ఆహా యాప్‌ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల ఉండగా డిస్నీ హాట్ స్టార్ అందుకే బిగ్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రయత్నించి చెర్రీను ఎంచుకుంది. ఇందుకు గాను దాదాపు 3 కోట్ల భారీ పారితోషకం చెల్లించినట్లు ప్రచారం జరుగుతుంది.