RGV : నన్ను పార్టీలోకి రమ్మన్నారు, పోటీ చేయమన్నారు.. కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనని పొలిటికల్ పార్టీలు తమ పార్టీల్లోకి రమ్మని ఆహ్వానించాయని, తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాడు.

RGV : నన్ను పార్టీలోకి రమ్మన్నారు, పోటీ చేయమన్నారు.. కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

Ram Gopal Varma comments on his political entry

Ram Gopal Varma :  సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసేసి ప్రస్తుతం తన ఇష్టం అంటూ ఇష్టమొచ్చిన సినిమాలు తీస్తున్నారు. ఇక సమాజంలోని ఏదో ఒక విషయంపై స్పందిస్తూ అప్పుడప్పుడు ట్విట్టర్(Twitter) లో హడావిడి చేస్తారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం(Vyooham) అనే సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా వైసీపీ కోసమని, 2024 ఎన్నికలు(Elections) టార్గెట్ గా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. దీని గురించి ఇప్పటికే జగన్ తో రెండు సార్లు మీట్ అయ్యారు ఆర్జీవీ.

గతంలోనూ ఆర్జీవీ పలు పొలిటికల్ సినిమాలు చేశారు. పొలిటికల్ పార్టీలలోని పలు వ్యక్తులతో కూడా ఆర్జీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. పొలిటికల్ అంశాలపై ఆర్జీవీ రెగ్యులర్ గా మాట్లాడతారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనని పొలిటికల్ పార్టీలు తమ పార్టీల్లోకి రమ్మని ఆహ్వానించాయని, తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాడు.

James Cameron : టైటాన్ కథ విషాదాంతం.. కానీ టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అక్కడికి 33 సార్లు వెళ్ళొచ్చాడు..

ఆర్జీవీ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నన్ను గతంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్ తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారు. నన్ను పోటీ చేయమని కూడా అడిగారు. నాకు కొంచెం ఫాలోయింగ్ ఉందని, నేను వస్తే వాళ్ళకి ఓట్లు వస్తాయని భావించారు. కానీ అది జరగదు. నేను పాలిటిక్స్ లోకి అస్సలు రాను. నాకు సర్వీస్ చేయడం రాదు, నేను ఇంకొకరి కోసం పని చేయను. అందుకే నేను పాలిటిక్స్ లోకి రాను. కానీ పొలిటికల్ సినిమాలు తీస్తాను. భవిష్యత్తులో కూడా పొలిటికల్ సినిమాలు తీసే అవకాశం ఉంది. నాకు పొలిటికల్ సైకాలజీ అంటే ఇష్టం అని అన్నారు. అయితే ఆర్జీవీని రాజకీయాల్లోకి ఎవరు ఆహ్వానించారో మాత్రం చెప్పలేదు.