PM Modi Invitation : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం

ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తు పూర్తి అయింది. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనన లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.

PM Modi Invitation : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం

PM Modi - Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Idol Installation : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. 2024 జనవరిలో అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని మోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. 2024 జనవరి 15 నుంచి 24 వరకు అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

దేశంలో ప్రతి గ్రామంలోని దేవాలయాలను కార్యక్రమంలో పాల్గొనేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తు పూర్తి అయింది. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనన లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.

Water of 115 Nations: అయోధ్య రామాలయం కోసం 115 దేశాల నీరు

అయోధ్యలో శ్రీరామ దేవాలయం చాలా గొప్పగా నిర్మిస్తున్నారు. అయోధ్యలో శ్రీరామ దేవాలయంలో తిరుమల తరహాలో భద్రతను కల్పించనున్నారు. అయోధ్యలోని రామ మందిరం కోసం 115 దేశాల నుంచి నీటిని సేకరించినట్లు ఢిల్లీకి చెందిన ఎన్జీవో ప్రకటించింది.

వీటిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, కంబోడియా, చైనా, క్యూబా, డీపీఆర్ కాంగో, ఫిజి, కెనడా, జర్మనీ, ఇటలలీ, ఫ్రాన్స్, మారిషస్, మయన్మార్, మంగోలియా, మొరాకో, మలేషియా, ఐర్లాండ్, జపాన్, ఇజ్రాయెల్, మాల్దీవులు, న్యూజిలాండ్ నుంచి నీటిని సేకరించినట్లు చెబుతున్నారు. దేశం మరియు ప్రపంచంలోని ప్రజలు ఆలయ నిర్మాణానికి కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు.