Statue of Equality: ముచ్చింతల్‌కు అమిత్ షా.. 7వ రోజు కార్యక్రమాలు ఇవే!
Statue of Equality: అమోఘం.. అద్భుతం.. అద్వితీయం.. కమనీయం.. ముచ్చింతల్ మహాక్షేత్రంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు గురించి ప్రజలు అనుకుంటున్న మాటలివి.

Muchinthal
Statue of Equality: అమోఘం.. అద్భుతం.. అద్వితీయం.. కమనీయం.. ముచ్చింతల్ మహాక్షేత్రంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు గురించి ప్రజలు అనుకుంటున్న మాటలివి. ముచ్చింతల్ ప్రాంతంలో జరుగుతున్న మహోత్తర కార్యక్రమంకి ప్రముఖులు ఒక్కొక్కరుగా విచ్చేస్తున్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ఇప్పటికే ఆరు రోజుల కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈరోజు(8 ఫిబ్రవరి 2022) ఏడవ రోజు ప్రవచన మండపంలో దేశ, విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు.
రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అమిత్ షా. సాయంత్రం 5గంటలకు శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞ హోమం.. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరగనుంది.
ఈరోజు ఉదయం 6.30 కి అష్టాక్షరీ మంత్ర పఠనం.. ఉదయం 7.30కి శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన.. ఉదయం 8.30కి శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం.. 9గంటలకు యాగశాలలో చతుర్వేద పారాయణం.. ఉదయం 10.30కి దుష్టగ్రహ బాధానివారణకై శ్రీ నారసింహ ఇష్టి..
ఉదయం10.30 కి జ్ఞానాజ్ఞానకృత సర్వవిధ పాప నివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి..11 గంటలకు ప్రవచన మండపం శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజ.. 12 గంటలకు సామూహిక ఆదిత్య పారాయణం. మధ్యాహ్నం 12.30కి పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగును.