Ranbir Kapoor : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నేను అర్హుడిని కాదు.. రణ్‌బీర్!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో రణ్‌బీర్ అండ్ అలియా అవార్డు రావడం పై కొందరు విమర్శిస్తుండగా, రణ్‌బీర్ తన స్పందన తెలియజేశాడు.

Ranbir Kapoor : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నేను అర్హుడిని కాదు.. రణ్‌బీర్!

Ranbir Kapoor

Ranbir Kapoor : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని నటులు మరియు సాంకేతిక నిపుణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్’. ఈ అవార్డుని అందుకోవడం లైఫ్ టైం అచీవ్మెంట్ లా భావిస్తారు. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డులను ప్రకటించారు. 2022లో రిలీజయిన సినిమాలకు గాను ఫిబ్రవరి 21న అవార్డులు అందించారు. ఇక ఈ అవార్డుల్లో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ అండ్ అలియా బెస్ట్ యాక్టర్స్ గా అవార్డులు అందుకున్నారు.

Ranbir Kapoor : చరణ్ పాటకు రణ్‌బీర్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

అయితే ఈ స్టార్ కపుల్ కి దాదా సాహెబ్ అవార్డు రావడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. నెపోటిజం వలనే రణ్‌బీర్ అండ్ అలియాకు ఈ అవార్డులను ఇచ్చారు అంటూ కంగనా వంటి స్టార్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అవార్డు గెలుచుకోవడం పై రణ్‌బీర్ స్పందించాడు. ”బ్రహ్మాస్త్ర సినిమాకు గాను నాకు అవార్డు రావడంతో అందరూ నాకు అభినందనలు తెలియజేస్తున్నారు, అందుకు థాంక్యూ. కానీ నేను ఆ అవార్డుని అందుకోడానికి పూర్తీ అర్హుడని కాదు. బ్రహ్మాస్త్ర మూవీలో నా నటనా ప్రదర్శన చెప్పుకోదగ్గ గొప్పగా ఏమి లేదు” అంటూ వ్యాఖ్యానించాడు.

అలాగే గంగూబాయి కతియావాడి చిత్రానికి అలియా భట్ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషిస్తున్నాను అంటూ తెలియజేశాడు. కాగా వీరితో పాటు దాదా సాహెబ్ అవార్డు అందుకున్న వారు..

మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార)

బెస్ట్ యాక్టర్ నెగిటివ్ రోల్ : దుల్కర్ సల్మాన్ (చుప్)

బెస్ట్ యాక్ట్రెస్ నెగిటివ్ రోల్ – మౌని రాయ్ (బ్రహ్మాస్త్ర)

సినీ పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు 2023 : రేఖ

ఉత్తమ వెబ్ సిరీస్ : రుద్ర

క్రిటిక్స్ ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేడియా)

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: RRR

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : అనుపమ

మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అఫ్ ది ఇయర్ : అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్)

మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఇన్ టెలివిజన్ – హర్షద్ చోప్రా

బెస్ట్ టీవీ యాక్టర్ : జైన్ ఇమామ్

బెస్ట్ టీవీ యాక్ట్రెస్ – తేజస్వి ప్రకాష్ (నాగిని 6)

బెస్ట్ మేల్ సింగర్ : సచేత్ టాండన్ (మయ్యా మైను – జెర్సీ)

బెస్ట్య్ ఫీమేల్ సింగర్ : నీతి మోహన్ ( మేరీ జాన్ – గంగూబాయి కతియావాడి)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: PS వినోద్ (విక్రమ్ వేద)

సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు 2023 : హరిహరన్