Ranveer Singh : పుష్పలోని ఆ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పుష్ప సినిమాలోని ఓ పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న సినిమా 'జయేశ్‌భాయ్‌ జోర్దార్‌'........

Ranveer Singh : పుష్పలోని ఆ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..

Pushpa

 

Pushpa :  అల్లు అర్జున్ నటించిన మన తెలుగు సినిమా పుష్ప దేశ వ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. బాలీవుడ్ లో అయితే అనూహ్యంగా బ్లాక బస్టర్ కొట్టి కోట్లలో కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఈ సినిమాకి, సినిమాలోని పాటలకి, అల్లు అర్జున్ స్టైల్, మాస్ యాక్షన్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బాలీవుడ్ స్టార్లు కూడా పుష్ప సినిమాకి ఫ్యాన్స్ అయిపోయి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాలోని పాటలు ఖండాలు దాటి ప్రపంచమంతటా వినిపించాయి

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పుష్ప సినిమాలోని ఓ పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న సినిమా ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ రిలీజ్ కి రెడీగా ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రణ్‌వీర్‌. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు తెలుగులో బాగా నచ్చిన పాట ఏది? అని అడిగాడు. దీనికి రణవీర్ సమాధానమిస్తూ.. ”అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా సాంగ్‌ చాలా ఇష్టం. ఈ పాట విన్నప్పుడు ఐయామ్‌ గోయింగ్‌ మ్యాడ్‌. ఆ పాట మీనింగ్‌ నాకు తెలీదు కానీ నా మనసును టచ్ చేసింది. అందుకే ఆ పాట నాకు పిచ్చి ఇష్టం” అని తెలిపాడు.

Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..

 

సమంత స్పెషల్ సాంగ్ గా రిలీజైన ఊ అంటావా మామ సాంగ్ అందర్నీ ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణవీర్ కూడా తనకి ఈ పాట ఇష్టమని చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై పుష్ప యూనిట్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.