Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..

నందిని రెడ్డి సమంత గురించి మాట్లాడుతూ.. ''మేమిద్దరం కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి జబర్దస్త్ సినిమా చేశాం. ఆ సమయంలో సమంత.............

Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..

Samantha

Updated On : May 12, 2022 / 6:32 AM IST

Samantha :  సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి ఎప్పట్నుంచో మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు వచ్చాయి. ఆహాలో వచ్చిన సమంత టాక్ షోని కూడా నందినినే డైరెక్ట్ చేసిందని సమాచారం. గతంలో కూడా వీరిద్దరూ ఒకరిపై ఒకరు వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. సమంత ఇటీవల నందిని రెడ్డి బర్త్ డే రోజు స్పెషల్ పోస్ట్ చేసి తను లైఫ్ లో ఎంత సపోర్ట్ ఇచ్చిందో తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ నందిని రెడ్డి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

నందిని రెడ్డి సమంత గురించి మాట్లాడుతూ.. ”మేమిద్దరం కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి జబర్దస్త్ సినిమా చేశాం. ఆ సమయంలో సమంత నాకు బాగా క్లోజ్ అయింది. అక్కా చెల్లెళ్ళలాగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో సమంత లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. దీంతో సమంతకి మోరల్ సపోర్ట్ గా ఉండడంతో మరింత క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ ఒకరి విషయంలో ఒకరం సపోర్ట్ ఇచ్చుకుంటాం” అని తెలిపింది.

 

Sarkaru Vaari Paata : భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన నమ్రత..

ఇక సమంత విడాకుల గురించి మాట్లాడుతూ.. ”సమంత పర్సనల్ లైఫ్ లో నేను జోక్యం చేసుకోను. సమంతనే కాదు ఎవరి పర్సనల్ లైఫ్ లలో మనం జోక్యం చేసుకోకూడదు. అందుకే సమంత పర్సనల్ విషయాల గురించి నేను అడగను కూడా. భార్య భర్తల మధ్య సవా లక్ష ఉంటాయి. వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలుస్తుంది. బయటి వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోవడం అనవసరం. కానీ సమంత లైఫ్ లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను” అని చెప్పింది.