Rashmika Mandanna : ఒక అమ్మలా సమంతని దగ్గరుండి చూసుకోవాలని ఉంది.. నా ఇన్స్పిరేషన్ తనే..

రష్మిక మాట్లాడుతూ.. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తను ప్రకటించేదాకా కూడా నాకు తెలీదు. తను నాకు మంచి స్నేహితురాలు. సమంత ఒక అద్భుతమైన మహిళ. చాలా బాగా చూసుకుంటుంది అందర్నీ. మయోసైటిస్ గురించి..............

Rashmika Mandanna : ఒక అమ్మలా సమంతని దగ్గరుండి చూసుకోవాలని ఉంది.. నా ఇన్స్పిరేషన్ తనే..

Rashmika mandanna wants to protect samantha like mother

Updated On : January 4, 2023 / 10:54 AM IST

Rashmika Mandanna :  స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఇంటివద్దే ఉంది సమంత. అభిమానులు, ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్నా సమంత ఆరోగ్యం పై వ్యాఖ్యలు చేసింది.

రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రష్మికRashmika mandanna wants to protect samantha like mother నటించిన తమిళ సినిమా వరిసు, హిందీ సినిమా మిషన్ మజ్ను రిలీజ్ కి ఉన్నాయి. దీంతో ప్రమోషన్స్ తో బిజీగా అంది రష్మిక. బాలీవుడ్ లో మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడింది.

Srikanth : 100కి పైగా సినిమాలు.. కానీ మొదటిసారి తమిళ సినిమా చేస్తున్నా.. వారసుడు సినిమాపై శ్రీకాంత్ వ్యాఖ్యలు..

రష్మిక మాట్లాడుతూ.. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తను ప్రకటించేదాకా కూడా నాకు తెలీదు. తను నాకు మంచి స్నేహితురాలు. సమంత ఒక అద్భుతమైన మహిళ. చాలా బాగా చూసుకుంటుంది అందర్నీ. మయోసైటిస్ గురించి నాకు చెప్పలేదు. అందరు తెలుసుకున్నట్టే నేను కూడా తెలుసుకున్నాను. సమంత జీవితంలో ఎన్నో సవాళ్ళని ధైర్యంగా పోరాడి నిల్చుంది. అలాంటి వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. నాకు కూడా తనే ఇన్స్పిరేషన్. ఆమెకి అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నాకైతే ఆమె దగ్గర ఉండి ఒక అమ్మలాగా చూసుకోవాలని ఉంది. తనకోసం ప్రార్ధిస్తున్నాను అని తెలిపింది. దీంతో రష్మిక చేసిన వ్యాఖ్యలపై సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.