Rashmika Mandanna : మరో మూడేళ్ళలో నా ఇల్లు అడివి అయిపోతుంది..

రష్మికకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన దగ్గర ఆరా అనే ఓ పెట్ డాగ్ ఉంది. అప్పుడప్పుడు ఆ పెట్ డాగ్ తో గడుపుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో..............

Rashmika Mandanna : మరో మూడేళ్ళలో నా ఇల్లు అడివి అయిపోతుంది..

Rashmika

Rashmika Mandanna :  ప్రస్తుత ఫుల్ ఫామ్ లో ఉంది రష్మిక మందన్న. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తుంది రష్మిక. ఇక రష్మికకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన దగ్గర ఆరా అనే ఓ పెట్ డాగ్ ఉంది. అప్పుడప్పుడు ఆ పెట్ డాగ్ తో గడుపుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

Aamir Khan : షూటింగ్‌లో గాయం.. అయినా షూటింగ్ ఆపని అమీర్ ఖాన్..

తాజగా మరో కొత్త పెట్ ని తెచ్చుకుంది రష్మిక. అయితే ఈ సారి పిల్లిని తెచ్చుకుంది. పిల్లిని ఎత్తుకొని రష్మిక దిగిన వీడియోని షేర్ చేస్తూ.. ”ఇది నా కొత్త పెట్‌ స్నో. ఇంకో 3 సంవత్సరాల్లో నా ఇల్లు ఒక చిన్నపాటి అడవిగా మారిపోతుందేమో” అని పోస్ట్ చేసింది. అలాగా తన పెంపుడు కుక్క, పిల్లి రెండిటిని ఒకే బెడ్ పై కూర్చోపెట్టి వాటిని ఫోటో తీసి దాని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి ”నేను ఎప్పుడు బెడ్ మీదకి వస్తానా అని ఆ రెండూ ఎదురు చూస్తున్నాయి. వీటిని ఇలా చూసి నా గుండె నిండిపోయింది” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. రష్మిక ఇలా పెట్స్ తో ఉన్న వీడియోల్ని పోస్ట్ చేస్తూ ఉంటే అభిమానులు, నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.