Raamayanam : ఆ రావణుడు ఇక లేడు..

రామాయణ్‌' ధారావాహిక విడుదలై 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ సీరియల్‌ అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. ఈ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని రామానంద సాగర్‌ రచించి, దర్శకత్వం వహించారు

Raamayanam : ఆ రావణుడు ఇక లేడు..

Ravan

Raamayanam :  1980లో దూరదర్శన్ లో వచ్చిన రామాయణ్ సీరియల్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసింది. అప్పట్లో దేశమంతా ఈ సీరియల్ ని ఫాలో అయ్యేవారు. ఆ తర్వాత మళ్ళీ గత సంవత్సరం లాక్ డౌన్ లో 2020 ఏప్రిల్‌ 16న తిరిగి ప్రసారమైన రామయణ్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘రామాయణ్‌’ ధారావాహిక విడుదలై 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ సీరియల్‌ అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. ఈ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని రామానంద సాగర్‌ రచించి, దర్శకత్వం వహించారు. రామాయణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

Sanjana Galrani : రోడ్డుపై క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన హీరోయిన్.. ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు..

ఈ ‘రామయణ్‌’ లో రావణాసురుడిగా నటించి మెప్పించిన అరవింద్‌ త్రివేది నిన్న రాత్రి మరణించారు. గత కొంతకాలంగా వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అరవింద్‌ త్రివేది ‘రామాయణ్‌’ సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్ తో పాటు, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.