Sanjana Galrani : రోడ్డుపై క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన హీరోయిన్.. ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు..

తాజాగా తెలుగు, కన్నడ హీరోయిన్ సంజన గల్రాని మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల డ్రగ్స్‌ వినియోగం, డ్రగ్స్ రవాణా కేసులో జైలుకి వెళ్లి వచ్చింది సంజన. డ్రగ్స్ కేసులతో ఇన్నాళ్లు

Sanjana Galrani : రోడ్డుపై క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన హీరోయిన్.. ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు..

Sanjana

Sanjana Glrani  :  అప్పుడప్పుడు సెలబ్రిటీలు మామూలు జనాలతో గొడవపడుతూ ఉంటారు. అలా గొడవపడి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తెలుగు, కన్నడ హీరోయిన్ సంజన గల్రాని మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల డ్రగ్స్‌ వినియోగం, డ్రగ్స్ రవాణా కేసులో జైలుకి వెళ్లి వచ్చింది సంజన. డ్రగ్స్ కేసులతో ఇన్నాళ్లు వార్తల్లో నిలిచింది. తాజాగా మరోసారి సంజన వార్తల్లో నిలిచింది.

హీరోయిన్ సంజన గల్రాని ఈసారి ఓలా క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ పడింది. నిన్న ఉదయం షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లడానికి బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి రాజరాజేశ్వరినగర్ కి ఆమె క్యాబ్‌ బుక్‌ చేశారు. క్యాబ్‌లోకి ఎక్కిన తరువాత గమ్యం మార్చాలని డ్రైవర్‌ సుసయ్‌ మణికి సూచించగా, అతడు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి అడిగాడు కానీ లొకేషన్‌ను మార్చలేదు. దీంతో కోపంతో సంజన రోడ్డు మీదే నానాతిట్లు తిడుతూ తనతో గొడవ పెట్టుకుందని డ్రైవర్‌ ఆరోపించాడు. ఆ గొడవను వీడియో కూడా తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంజన పై క్యాబ్ డ్రైవర్ రాజరాజేశ్వరినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Rajeev Kanakala : నన్ను రాళ్లతో చెప్పులతో కొడతారు ఆడవాళ్లు : రాజీవ్ కనకాల

సంజన ట్విట్టర్ లో ఓలా క్యాబ్స్ ని ట్యాగ్ చేస్తూ.. డ్రైవర్ తాను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని, క్యాబ్‌లో ఏసీని పెంచాలని అడిగితే నిర్లక్ష్యంగా బదులిచ్చాడని, కారు డోర్‌ కూడా సరిగాలేదని చెప్పారు. అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డబ్బా కారులో వెళ్లాలా అని పోస్ట్ చేశారు. కారులో ఉండగానే సంజన కూడా డయల్‌ 100కు ఫోన్‌ చేసి డ్రైవర్‌పై ఫిర్యాదు చేసింది.