Nandyal District : ఏపీలో విషాద ఘటన.. వ్యవసాయ బావిలోపడిన 40 గేదెలు.. ఊపిరాడక ఎనిమిది మృతి..
Nandyal District : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలం కృష్ణారావుపేట వద్ద ప్రమాదవ శాత్తు 40గేదెలు వ్యవసాయ బావిలో పడిపోయాయి.
Nandyal District : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలం కృష్ణారావుపేట వద్ద ప్రమాదవ శాత్తు 40గేదెలు వ్యవసాయ బావిలో పడిపోయాయి. బావిలో ఊపిరాడక ఎనిమిది గేదెలు మృతి చెందాయి. బావిలో పడిన గేదెలను కాపాడేందుకు స్థానిక రైతులు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో గేదెలను బయటకు తీసేందుకు కొంత ఆటంకం ఎదురైంది.
Also Read : Bhojshala-Kamal Maula Controversy : హిందువులకు అనుకూలంగా తీర్పు.. అసలేంటి భోజ్ శాల – కమల్ మౌలా మసీదు వివాదం?
గ్రామానికి చెందిన పెద్దసామేలు, లక్ష్మమ్మ, ఈడిగ రమణ, శంకర్ గౌడు, జక్కరయ్య, మనోహర్, హర్షపోగు శ్రీనివాసులు మరో వ్యక్తి గేదెలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం గేదెలను మేతకోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వారు ఇళ్ల వద్ద భోజనం చేసి వచ్చేందుకు వెళ్లారు.
అయితే, ఎండల తీవ్రతతో గేదెలు నీటికోసం వెతుకుతూ సమీపంలోని పొలంలో ఉన్న బావి వద్దకు వెళ్లాయి. బావిలోని నీటిని తాగేందుకు యత్నించిన సమయంలో ఒక్కొక్కటిగా బావిలో పడిపోయాయి. ఈ క్రమంలో ఎనిమిది గేదెలు ఊపిరాడక చనిపోయాయి.
భోజనం ముగించుకొని పొలం వద్దకు వెళ్లిన యాజమానులకు గేదెలు కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా సాయంత్రం 6గంటల సమయంలో బావిలో పడినట్లు గుర్తించారు. దీంతో స్థానిక అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు జేసీబీ సహాయంతో గేదెలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
ఎనిమిది గేదెలు మరణించగా.. మరికొన్ని కొనిపించకుండా పోయినట్లు గేదెల యాజమానులు తెలిపారు. ఒక్కో గేదె విలువ రూ.లక్షకుపైనే ఉంటుందని తెలిపారు. పాడి పశువులు మృత్యువాత పడడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.
