Raviteja: ‘ఛాంగురే బంగారు రాజా’ అంటోన్న మాస్ రాజా.. కానీ!

మాస్ రాజా రవితేజ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను రొటీన్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు మాస్ రాజా.

Raviteja: ‘ఛాంగురే బంగారు రాజా’ అంటోన్న మాస్ రాజా.. కానీ!

Raviteja: మాస్ రాజా రవితేజ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను రొటీన్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు మాస్ రాజా. ఈ క్రమంలోనే తన ప్రొడక్షన్ హౌజ్ నుండి రాబోయే నెక్ట్స్ మూవీకి సంబంధించి మాస్ రాజా ఓ తాజా అప్డేట్ ఇచ్చాడు.

Raviteja : రవితేజకి ఏమైంది..? ఎందుకీ వరుస ఫ్లాపులు..?

ఆర్‌టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై దర్శకుడు సతీష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘ఛాంగురే బంగారు రాజా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఇక ఈ సినిమాలో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఖుషిత కల్లపు హీరోయిన్‌గా నటించనుంది. ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సత్య, రవిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Raviteja Nephew as Hero : ఖిలాడీ డైరెక్టర్ కథతో.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ తమ్ముడి కొడుకు

కాగా, ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తుండగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఇక ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మచ్చేలా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాతో రవితేజ నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు, ధమాకా వంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు.