Raviteja : రవితేజకి ఏమైంది..? ఎందుకీ వరుస ఫ్లాపులు..?

బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులు, ఏ జానర్ టచ్ చేసినా అసలు అడ్రస్ లేని సక్సెస్. ఈమధ్య రవితేజ కెరీర్ ఇలాగే కంటిన్యూ అవుతోంది. ఎంటర్టైన్మెంట్ తప్ప సినిమాలో మాకేం అద్బుతాలు వద్దని ఆడియన్స్ క్లియర్ హింట్ ఇస్తున్నా..........

Raviteja : రవితేజకి ఏమైంది..? ఎందుకీ వరుస ఫ్లాపులు..?

Mass Maharaj :  బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులు, ఏ జానర్ టచ్ చేసినా అసలు అడ్రస్ లేని సక్సెస్. ఈమధ్య రవితేజ కెరీర్ ఇలాగే కంటిన్యూ అవుతోంది. ఎంటర్టైన్ మెంట్ తప్ప సినిమాలో మాకేం అద్బుతాలు వద్దని ఆడియన్స్ క్లియర్ హింట్ ఇస్తున్నా ఇంకా రవితేజ అర్దం చేస్కోవడం లేదేంటి..? సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రవితేజ మ్యాజిక్ కి ఇప్పుడేమైంది..? రవితేజ డై హార్డ్ ఫాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యే రేంజ్ లో సినిమాలెందుకు చేస్తున్నారు..? అని ఫాన్స్ ఆలోచనలో పడ్డారు.

 

లేటెస్ట్ గా రిలీజ్ అయిన రామారావు ఆన్ డ్యూటీ అంతకుముందొచ్చిన ఖిలాడి సినిమాలు రవితేజ కెరీర్ లో డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. సినిమాల స్పీడ్ మీద తప్ప సక్సెస్ మీద రవితేజ పెద్దగా కాన్సన్ ట్రేట్ చెయ్యడం లేదా అన్న టాక్ మొదలైంది ఆడియన్స్ లో. రవితేజ సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ . ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్ కోసమే జనాలు రవితేజ సినిమా చూడడానికి వెళతారు. అందుకే ఒకప్పుడు రవితేజ సినిమాలంటే కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సో కాల్డ్ కమర్షియల్ హీరోలా హీరోయిజానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్ ని రవితేజ దూరం చేస్తున్నారని, దాంతో ప్రేక్షకులకి రవితేజ కూడా దూరమవుతున్నారని అంటున్నారు ఫ్యాన్స్.

Heroins : మా లైఫ్ మా ఇష్టం అంటున్న హీరోయిన్స్

గతంలో రవితేజ ఫ్లాప్ సినిమాలు ఖతర్నాక్, ఆంజనేయులు, దరువు, దేవుడు చేసిన మనషులు, టచ్ చేసి చూడు లాంటి సినిమాల్లో కూడా రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ ఈమధ్య కాలంలో కొత్తదనం కావాలని కలిసొచ్చే ఎంటర్టైనర్మెంట్ ని పక్కన పె్ట్టేస్తున్నారు. దాంతో రవితేజ అభిమానాలు బాగా హార్ట్ అవుతున్నారు. మాకేం అద్బుతాలు వద్దు మహాప్రభో పాత రవితేజ మార్క్ సినిమాలు మాక్కావాలి అంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. కానీ రవితేజ నెక్స్ట్ సినిమాలు కూడా హీరోయిజం సినిమాల్లానే ఉన్నాయి అని తెలుస్తుంది. దీంతో రవితేజ వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో అని భాదపడిపోతున్నారు అభిమానులు.