Heroins : మా లైఫ్ మా ఇష్టం అంటున్న హీరోయిన్స్

మై లైఫ్.. మై రూల్స్ అంటున్నారు హీరోయిన్లు. ఎవరేమనుకుంటే మాకేంటి..? ఎవరెలా కామెంట్ చేస్తే మాకేంటి..? మా లైఫ్ మా ఇష్టం అంటున్నారు. పెళ్లయిన వెంటనే తల్లైనా, మేకప్ లేకుండా బయటికొచ్చినా, ఐటమ్ సాంగ్స్ చేసినా మీకేంటి ప్రాబ్లమ్? అంతకష్టంగా ఉంటే.....

Heroins : మా లైఫ్ మా ఇష్టం అంటున్న హీరోయిన్స్

Heroins :  మై లైఫ్.. మై రూల్స్ అంటున్నారు హీరోయిన్లు. ఎవరేమనుకుంటే మాకేంటి..? ఎవరెలా కామెంట్ చేస్తే మాకేంటి..? మా లైఫ్ మా ఇష్టం అంటున్నారు. పెళ్లయిన వెంటనే తల్లైనా, మేకప్ లేకుండా బయటికొచ్చినా, ఐటమ్ సాంగ్స్ చేసినా మీకేంటి ప్రాబ్లమ్? అంతకష్టంగా ఉంటే కళ్లుమూసుకోండి, మా లైఫ్ ని డిసైడ్ చెయ్యడానికి మీరెవరు? అసలు మేం ఎలా ఉంటే మీకెందుకు అంటూ నెటిజన్లకి గట్టిగా కౌంటర్లిస్తున్నారు హీరోయిన్స్.

అభిమానానికి హద్దులుండాలంటున్నారు హీరోయిన్లు. మా జీవితాల్లో మీ బోడి పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. హీరోయిన్లైన పాపానికి ప్రతీదీ మీకు నచ్చినట్టు, మీరు కోరుకునేట్టు చెయ్యడం జరగదని స్ట్రిక్ట్ గా చెప్పేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లయి 3 నెలలు తిరగ్గకుండానే తల్లైనందుకు తెగ ట్రోల్ చేశారు. ఇలా పెళ్లైందో లేదో అప్పుడే తల్లైంది అంత తొందరెందుకు అంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. అంతేకాదు పిల్లలు పుడితే ఇక అంతే సంగతులు, ఇక సినిమాలేం చేస్తుంది, ఆలియా కెరీర్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టే అని కూడా అన్నారు. అయితే ఆలియా మాత్రం నా పెళ్లి, నా భర్త, నా పిల్లలు, నా ఇష్టం. ఏది ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు చేస్తాను. తల్లవ్వాలనుకున్నాను అయ్యాను దానికి మీ జడ్జిమెంట్ అవసరం లేదు. అయినా పెళ్లయ్యి పిల్లలుపుడితే కెరీర్ ఎందుకు ఆగిపోతుంది..? నేను నాకు ఇంట్రస్ట్ ఉన్నంత వరకూ సినిమాలు చేస్తూనే ఉంటానంటూ గట్టిగానే పంచ్ ఇచ్చింది.

మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా అంతే. అసలు నా లైఫ్ లో ఇంటర్ ఫియర్ అవ్వడానికి మీరెవరు అంటోంది. ఈమధ్య కరీనా కపూర్ వర్కవుట్ చేసిన తర్వాత సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్ల కామెంట్స్ కి హద్దే లేకుండా పోయింది. కరీనా ఏజ్ అయిపోయింది, మేకప్ లేకుండా ఇంత దరిద్రంగా ఉంటుందా..? అసలు అబ్బాయి ఫోటోలా ఉంది. అంటూ కామెంట్లతో దారుణంగా ట్రోల్ చేశారు కరీనాని. దాంతో కరీనా కూడా నా అకౌంట్ లో నేను నా ఇష్టమొచ్చిన ఫోటోలు షేర్ చేస్తాను, దానికి మీ పర్మిషన్ అవసరం లేదు, వర్కవుట్ చేసిన తర్వాత చెమటతో ఒరిజనల్ లుక్ ఉంటుంది కానీ అప్పుడు కూడా మేకప్ వేసుకుని ఉంటారా..? ఇంత బుద్ది లేకుండా ఎలా ఆలోచిస్తున్నారు అంటూ చివాట్లు పెడుతోంది కరీనా కపూర్. గతంలో కరీనా రెండో కొడుకు పుట్టిన తర్వాత చేసిన ర్యాంప్ వాక్స్, ఫ్యాషన్ షోల్లో కూడా లావుగా ఉందని కరీనాని నెగెటివ్ గా ట్రోల్ చేశారు.

Rashmika : అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి పిచ్చెక్కుతుంది.. ఈ రేంజ్ లో రష్మిక ఎప్పుడూ నవ్వి ఉండదు..

సమంత కూడా తనపై కామెంట్లు చేస్తున్న వాళ్లకి ఘాటు కౌంటర్లిస్తోంది. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్యని ఎక్స్ హజ్బెండ్ అన్నందుకు నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అసలు అక్కినేని ఫ్యామిలీలో లేకపోతే నీకు స్టార్ హీరోయిన్ హోదా ఉండేదా..? సినిమా అవకాశాల కోసం భర్తనే వదిలేస్తావా అంటూ ట్రోల్ చేశారు. కానీ సమంత మాత్రం నా మనశ్శాంతి నాకు ఫస్ట్ ప్రయారిటీ. దానికి ఇబ్బంది కలిగించే వాళ్లకు నేను దూరంగానే ఉంటానంటూ సింపుల్ పంచ్ తో సరిపెట్టేసింది. అంతే కాదు పుష్పలో స్పెషల్ సాంగ్ చేసినందుకు కూడా డబ్బుకోసం ఇంత దిగజారిపోవాలా..? మరీ అవకాశాల కోసం ఇంత ఎక్స్ పోజింగ్ చెయ్యాలా అంటూ ట్రోల్ చేశారు. కానీ సమంత మాత్రం నా కెరీర్ నా ఇష్టం, నాకు చెయ్యాలనిపించిన క్యారెక్టర్ నేను చేస్తాను అంటూ కౌంటరిచ్చింది.

ఇలా ఇటీవల చాలా మంది హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు తమపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఎన్ని ట్రోల్స్ చేసినా ఇది మా లైఫ్ మా ఇష్టం అంటూ తమకి ఇష్టమొచ్చింది చేసుకెళ్తున్నారు.