Raviteja Nephew as Hero : ఖిలాడీ డైరెక్టర్ కథతో.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ తమ్ముడి కొడుకు
మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ.........

Raviteja Nephew introduce as hero
Raviteja Nephew as Hero : మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏయ్… పిల్లా’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ ”హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుబూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.
Dulquer Salman : హీరో అవుతాను అంటే.. నా పరువు తీయకు, నీ వల్ల కాదు అన్నారు..
‘ఏయ్… పిల్లా’ చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడు ఖిలాడీ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.