Dulquer Salman : హీరో అవుతాను అంటే.. నా పరువు తీయకు, నీ వల్ల కాదు అన్నారు..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ''నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందుకే నాకు ఫైట్లు, డ్యాన్స్ లు కూడా నేర్పించలేదు. ఆయన చెప్పినట్టు చదువుకుని దుబాయ్‌లో...............

Dulquer Salman : హీరో అవుతాను అంటే.. నా పరువు తీయకు, నీ వల్ల కాదు అన్నారు..

Dulquer Salmaan

Dulquer Salman :  మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మలయాళంతో పాటు అన్ని సౌత్ భాషల్లో పేరు, అభిమానులని సంపాదించుకున్నాడు. ఇటీవలే సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు దుల్కర్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా సీతారామం సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో దుల్కర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. అలాగే తాను హీరో అవుతానంటే వల్ల నాన్న, స్టార్ హీరో మమ్ముట్టి ఏమన్నారో చెప్పారు.

Megastar Chiranjeevi : ఇంటికి పిలిచి మరీ అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్.. ఆర్థికంగా కూడా సహాయం..

ప్రెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ”నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందుకే నాకు ఫైట్లు, డ్యాన్స్ లు కూడా నేర్పించలేదు. ఆయన చెప్పినట్టు చదువుకుని దుబాయ్‌లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉంటూ ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. తిరిగొచ్చి హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. నాన్నని మొదటిసారి చాలా కోపంతో చూశాను. హీరోగా చేస్తానని చెప్పగానే.. నువ్వు ఎప్పుడూ సరదాగా కూడా డ్యాన్స్ చేయలేదు, యాక్టింగ్ చేయలేదు. యాక్టింగ్‌ అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచనలు చేయకు అని బాగా తిట్టారు. కానీ ఇప్పుడు ఆయనే నా సినిమాలు చూసి నన్ను అభినందిస్తున్నారు” అని తెలిపాడు.