Realme 10 Pro Coca-Cola Edition : రియల్‌మి 10ప్రో కోకా-కోలా ఎడిషన్ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్ అదిరింది.. కొంటే.. ఇలాంటి ఫోన్ కొనాలి..!

Realme 10 Pro Coca-Cola Edition : రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి10 ప్రో కోకా-కోలా ఎడిషన్ కొత్త మోడల్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందే అధికారికంగా కంపెనీ ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో వెల్లడైంది.

Realme 10 Pro Coca-Cola Edition : రియల్‌మి 10ప్రో కోకా-కోలా ఎడిషన్ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్ అదిరింది.. కొంటే.. ఇలాంటి ఫోన్ కొనాలి..!

Realme 10 Pro Coca-Cola edition design officially revealed, here is how it looks

Realme 10 Pro Coca-Cola Edition : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి10 ప్రో కోకా-కోలా ఎడిషన్ కొత్త మోడల్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందే అధికారికంగా కంపెనీ ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో వెల్లడైంది. అధికారిక పోస్టర్ ప్రకారం.. రియల్‌మి 10 ప్రో వెనుక ప్యానెల్ ప్రత్యేకమైన కోకాతో మాట్ బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కుడి వైపున కోలా బ్రాండింగ్, వెనుక కెమెరాల చుట్టూ రిమ్‌లు కూడా FMCG బ్రాండ్ సరిపోయేలా కోకా-కోలా రెడ్ ఫినిషింగ్‌ను కలిగి ఉన్నాయి.

కింది ఎడమ వైపున, సిల్వర్ కలర్‌లో Realme Logo ప్రముఖంగా కనిపిస్తుంది. ఫిజికల్ డిజైన్‌లో మార్పులే కాకుండా.. స్మార్ట్‌ఫోన్ బాక్స్ వెలుపల కోకా-కోలా థీమ్‌తో రానుంది. Realme 10 Pro ప్రత్యేక ఎడిషన్‌ లాంచ్ చేసేందుకు Coca-Colaతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అయితే, Realme గతంలో స్మార్ట్‌ఫోన్‌ల ప్రత్యేక ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. గత ఏడాది జూలైలో థోర్ : లవ్ అండ్ థండర్ మూవీ రిలీజ్ సందర్భంగా కంపెనీ మార్వెల్‌తో కలిసి పనిచేసింది. కంపెనీ ప్రత్యేక ప్యాకేజీతో Realme GT Neo 3 థోర్ ఎడిషన్ ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్ చేసింది. Realme 10 Pro Coca-Cola ఎడిషన్‌ కూడా రెండు బ్రాండ్‌లు ప్రత్యేక ప్యాకేజీలో కొన్ని కోకా-కోలా ఫీచర్లతో అందించవచ్చు.

Realme 10 Pro Coca-Cola edition design officially revealed, here is how it looks

Realme 10 Pro Coca-Cola edition design officially revealed

Read Also : Realme GT Neo 5 Launch : 240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి GT నియో 5 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఈ ఎడిషన్ లిమిటెడ్ సైజులో అందుబాటులో ఉండవచ్చు. అందుకే, Realme ఇప్పటికే వెబ్‌సైట్ ద్వారా డివైజ్ బుక్ చేసుకునేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు బుకింగ్ కోసం వారి మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. Realme లాంచ్ తేదీన మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. డిస్‌ప్లే, ప్రత్యేక ప్యాకేజింగ్ కాకుండా.. చాలా స్పెసిఫికేషన్‌లు భారత మార్కెట్లో ఇప్పటికే రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. Realme 10 Pro సాధారణ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి. స్పెషల్ కోకా-కోలా ఎడిషన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్ల వారీగా చూస్తే.. Realme 10 Pro Coca-Cola ఎడిషన్ 120Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 SoCతో రన్ అవుతుంది. ఇందులో 108-MP ప్రైమరీ కెమెరా, వెనుకవైపు 2-MP సెకండరీ కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కూడా అందించవచ్చు.

Realme ఫోన్‌లు, Samsung, Apple స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తాయి. కోకా-కోలా ఎడిషన్ స్పెషల్ కలర్ ఛార్జింగ్ బ్రిక్‌తో పొందవచ్చు. Realme 10 Pro Coca-Cola ఎడిషన్‌లోని ఇతర ఫీచర్లతో సెల్ఫీల కోసం 16-MP ఫ్రంట్ కెమెరా, 5G (9 బ్యాండ్‌లు), డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, 6.72-అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. Realme 10 Pro Coca-Cola ఎడిషన్ ధర ఎంత అనేది క్లారిటీ లేదు. దీని ధర రూ. 20వేల లోపు ఉండవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : MY23 Renault Cars 2023 : రెనాల్ట్ ఇండియా నుంచి అదిరే ఫీచర్లతో 3 సరికొత్త కార్లు.. ఏయే కారు మోడల్ ధర ఎంత ఉందంటే? పూర్తి వివరాలు మీకోసం..!