Padma Awards 2021 : పద్మ పురస్కారాలను తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ పురస్కారాలను కొంతమంది తిరస్కరిస్తున్నారు. రోజు రోజుకు తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు తిరస్కరిస్తుండడం

Padma Awards 2021 : పద్మ పురస్కారాలను తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది

Padma Award

Refused The Padma Awards : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ పురస్కారాలను కొంతమంది తిరస్కరిస్తున్నారు. రోజు రోజుకు తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు తిరస్కరిస్తుండడం గమనార్హం.  ఇప్పటికే పద్మ భూషణ్ పురస్కారం వద్దని సీపీఎం సీనియర్ నేత, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా…బెంగాల్ ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీకి పద్మశ్రీ అవార్డు రావడంపై ఆమె కుమార్తె సేన్​గుప్తా స్పందించారు. 90 ఏళ్ల వయస్సులో…దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి అవార్డును ప్రకటించడం ఆమె స్థాయిని తగ్గించడమేనని.. అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : Jio Phone 5G : జియో నుంచి అత్యంత చౌకైన 5G ఫోన్.. ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

పద్మ శ్రీ అవార్డును బెంగాల్ కు చెందిన ప్రముఖ తబలా వాద్యకారుడు పండిట్​ అనింద్య ఛటర్జీ తిరస్కరించారు. తనకు పద్మశ్రీ వచ్చిందని ఢిల్లీ నుంచి ఫోన్​ వచ్చిందని, కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. తాను కేంద్రానికి ధన్యవాదాలు చెప్పాను..తన కెరీర్​ ముగింపు దశలో ఉన్నప్పుడు పద్మశ్రీ అందుకునేందుకు సిద్ధంగా లేనని వెల్లడించారు. ఆ ఫేజ్​ ఎప్పుడో దాటేశా అని అనింద్య ఛటర్జీ వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితమే ఈ పురస్కారం వచ్చి ఉంటే.. ఆనందంగా స్వీకరించేవాడినని తెలిపారు. అవార్డు తీసుకోను.. క్షమించమని అనింద్య ఛటర్జీ తెలిపారు. పండిట్​ రవిశంకర్​, ఉస్తాద్​ అమ్జద్​ అలీ ఖాన్​, ఉస్తాద్​ అలీ అక్బర్​ ఖాన్​ వంటి మహామహులతో కలిసి పనిచేశారాయన. అనింద్య పద్మా 2002లో సంగీత్​ నాటక్​ అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.