Reliance Trends: రిలయన్స్ ట్రెండ్స్ ‘బతుకమ్మతో సెల్ఫీ కాంటెస్ట్’.. సెల్ఫీ కొట్టు గిఫ్ట్ పట్టు..!
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా రిలయన్స్ ట్రెండ్స్ ఓ ఆస్తకరమైన సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా.. బతుకమ్మతో సెల్ఫీ దిగి పంపించడమే..

Reliance Trends Organizing Selfie Bathukamma Contest
Reliance Trends: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా రిలయన్స్ ట్రెండ్స్ ఓ ఆస్తకరమైన సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా.. బతుకమ్మతో సెల్ఫీ దిగి పంపించడమే.. బతుకమ్మతో సెల్ఫీ పేరుతో నిర్వహించే ఈ పోటీలో గెల్చినవారికి రూ.1,500 విలువైన గిఫ్ట్ అందించనుంది. రెండో బహుమతిగా రూ. 1000 విలువైన గిఫ్ట్ కార్డ్ అందించనుంది. భారత దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిలయన్స్ ట్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ బతుకమ్మ పండగ ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
RIL Share : రిలయన్స్‌ను దెబ్బతీసిన జియోఫోన్
ఇందులో భాగంగానే బతుకమ్మ పేరుతో సెల్ఫీ కాంటెస్టును నిర్వహించాలని నిర్ణయించింది. చిన్న పట్టణాల్లో ఈ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. బతుకమ్మ అంటే.. పూలనే దేవతగా కొలిచే పండుగ.. ఆడపడుచులంతా ఒకచోట చేరి రంగరంగుల పూలతో రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి ఆటలాడుతారు. ఆటపాటలతో పూజించి తమకు దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. తెలంగాణలోని చిన్న పట్టణాలలో ఈ పండగ ప్రత్యేకతని సంతరించుకుంది.
ఈ బతుకమ్మ సెల్ఫీ పోటీలో భాగంగా గౌరీ దేవిని పూజించే సమయంలో బతుకమ్మతో కలిసి మీరు తీసుకున్న సెల్ఫీని రిలయన్స్ ట్రెండ్స్ స్పెషల్ వాట్సాప్ నంబర్‌కు ఎంట్రీ కోసం పంపించాల్సి ఉంది. మీరు పంపిన సెల్ఫీ ఫొటోల్లో ఎవరి బతుకమ్మ అందంగా అలంకరిస్తారో ఆ సెల్ఫీ ఫొటోకు ఫస్ట్ ప్రైజ్ రూ.1,500 విలువైన బహుమతిని అందిస్తారు. రెండో బహుమతి కింద రూ.1000 విలువైన గిఫ్ట్ కార్డ్ అందించనున్నారు. అంతేకాదు.. పోటీలో పాల్గొన్నవారికి డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తారు. మీకు దగ్గరలోని రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్ నుంచి కూపన్ పొందవచ్చు. ఈ సెల్ఫీ పోటీ అక్టోబర్ 14, 2021న ముగియనుంది.
Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?