Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. దేశంలోనే అతిపెద్ద రిటైలర్ స్టోర్‌ (7-eleven Stores)ను ఇండియాలో లాంచ్ చేయనున్నారు. RRVL ఫస్ట్ 7-ఎలెవన్ కన్వీనియన్స్ స్టోర్ ప్రారంభం కానుంది.

Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?

Mukesh Ambani Brings 7 Eleven Stores To India, First One In Mumbai

Mukesh Ambani Brings 7-Eleven Stores To India : ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. దేశంలోనే అతిపెద్ద రిటైలర్ స్టోర్‌ (7-eleven Stores)ను ఇండియాలో లాంచ్ చేయనున్నారు. రిలయన్స్ సంస్థల అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) మొట్టమొదటి 7-ఎలెవన్ స్టోర్ (7-eleven stores) కన్వీనియన్స్ స్టోర్లను ప్రారంభించనుంది. అక్టోబర్ 9న శనివారం ముంబైలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలో 7-ఎలెవన్ మొదటి స్టోర్ ప్రారంభించనుంది. రిలయన్స్ ప్రత్యర్థి భారతీయ రిటైలర్ ఫ్యూచర్ గ్రూప్ అమెరికా కంపెనీతో ఒప్పందాన్ని ముగించుకున్న కొద్ది రోజులకే అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.
New TVS Jupiter : ఇండియాలో కొత్త స్కూటర్ లాంచ్.. ధర ఎంతంటే?

టెక్సాస్ ఆధారిత 7-ఎలెవెన్ ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో 77వేల కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (Reliance Retail Ventures)  7-ఎలెవన్ స్టోర్స్ గ్రేటర్ ముంబైలోని కీలకమైన వాణిజ్య ప్రాంతాలలో ప్రారంభించేందుకు ప్లాన్ చేసినట్టు RRVL ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి. అందుకే ప్రపంచంలో అతిపెద్ద కన్వీనియన్స్ రిటైలర్ ఇండియాలో అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయమని SEI ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జో డిపింటో (Joe DePinto) పేర్కొన్నారు.

ఫ్యూచర్ గ్రూప్‌తో 2019 ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే రద్దు అయింది. ఆ సంస్థ స్టోర్ ప్రారంభ లక్ష్యాలను చేరుకోలేకపోవడం, ఫ్రాంచైజ్ ఫీజు చెల్లింపుల్లో విఫలం కావడంతో ఒప్పందం రద్దు చేసుకుంది.  అయితే 21 బిలియన్ డాలర్ల (£ 15.5 బిలియన్) టర్నోవర్‌తో.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (RRVL) ఇండియాలోనే అతిపెద్దదిగా నిలిచింది. భారతదేశంలోనే అత్యంత లాభదాయకమైన రిటైలర్ సంస్థగా కంపెనీ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా కంపెనీతో  ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఈ  7-ఎలెవెన్ స్టోర్స్ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు పానీయాలు, స్నాక్స్ కస్టమర్లకు అందించనుంది. ఈ స్టోర్స్ ద్వారా స్థానికంగా చాలా ఉపాధి కల్పించనుంది.

మరోవైపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేతగా ముఖేశ్ అంబానీ నికర ఆదాయ విలువ 99 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదక వెల్లడించింది. RRVL అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. అన్నిరిటైల్ కంపెనీలు RIL గ్రూప్ కిందకు వస్తాయి. RRVL టర్నోవర్‌ రూ.157,629 (21.6 బిలియన్ డాలర్లు) కోట్లు.. మార్చ్ 31, 2021తో ముగిసిన ఏడాదికి రూ. 5,481 కోట్లు ( 750 మిలియన్ల డాలర్లు) నికర లాభం నమోదైంది. రిటైలింగ్ 2021 ఇండెక్స్‌లో టాప్ గ్లోబల్ రిటైలర్ల జాబితాలో 53వ స్థానం పొందింది. టాప్ 100లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రిటైలర్‌గా నిలిచింది.
RIL Share : రిలయన్స్‌ను దెబ్బతీసిన జియోఫోన్‌