RIL Share : రిలయన్స్‌ను దెబ్బతీసిన జియోఫోన్‌

టెలికాం రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ తీసుకురానున్న సంగతి తెలిసిందే. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు..

RIL Share : రిలయన్స్‌ను దెబ్బతీసిన జియోఫోన్‌

Ril Share

Updated On : September 13, 2021 / 7:29 PM IST

RIL Share : టెలికాం రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ తీసుకురానున్న సంగతి తెలిసిందే. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు.. దీంతో.. దీని కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ జియోఫోనే ఇప్పుడు రిలయన్స్ కొంప ముంచింది. రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

రిలయన్స్‌ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంచ్ చేస్తామని కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. అనూహ్యంగా లాంచింగ్ వాయిదా పడింది. ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీ కండక్టర్‌ కొరత కారణంగా జియోఫోన్‌ నెక్ట్స్‌ లాంచింగ్‌ వాయిదా పడింది. ఇప్పుడీ వ్యవహారం రిలయన్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ వాయిదా పడడంతో రిలయన్స్‌ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

సోమవారం జరిగిన బీఎస్‌ఈ ఇంట్రా డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ.2,382.85 దగ్గర నిలిచింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో రిలయన్స్‌ షేర్‌ విలువ రూ.2425.60 దగ్గర ఉండగా ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సుమారు రూ.55.80 మేర నష్టపోయి షేర్‌ విలువ రూ.2,382.85 దగ్గర నిలిచింది.

జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌, గూగుల్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరింత మెరుగుదల కోసం రెండు కంపెనీలు పరిమిత వినియోగదారులతో జియోఫోన్ నెక్స్ట్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.