Tickle Smile : కితకితలు పెడితే నవ్వు ఎందుకు వస్తుందో తెలుసా?
కితకితలు పెడితే పకపక నవ్వుతారు. విదిలించుకోవడానికి పరుగులు తీస్తారు. అసలు చక్కిలిగింతలు పెడితే నవ్వు ఎందుకు వస్తుందో తెలుసా?

Tickle Smile
Tickle Smile : చిన్నపిల్లల్ని సరదాగా నవ్వించడానికి కితకితలు పెడతారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవారిని కూడా కితకితలు పెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంటారు. చక్కిలిగింతలు పెట్టినప్పుడు ఎంతగా నవ్వు ఆపుకోలేమో.. అంతగా కొందరిలో కోపం కూడా వస్తుంది. అయితే కితకితలు పెడితే ఎందుకు పకపక నవ్వుతారో ఎంతమందికి తెలుసు.. దీని వెనుక సైన్స్ ఉందట.
Laughter lessons in Japan : మాస్క్ వల్ల నవ్వడం మర్చిపోతారా?
ఎవల్యూషనరీ బయాలజిస్టులు, న్యూరో సైటింస్టులు చక్కిలిగింతలు పెట్టినపుడు నవ్వుతామని నమ్ముతారు. ఎందుకంటే సున్నితమైన స్పర్శను అనుభవించినపుడు మెదడులోని హైపోథాలమనస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందిట. చేతుల క్రింద, గొంతు దగ్గర, పాదాల క్రింద చక్కిలిగింతలు పెడితే నవ్వు ఆపుకోలేం. అందుకే కితకితలు పెడితే అరవడం, విదిలించుకోవడం, ఎగరడం వంటివి చేస్తుంటాం. కొందరిలో చక్కిలిగింతలు ఇష్టపడరు. వారిలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తారు.
Reduce Stress : ఒత్తిడిని తగ్గించే మార్గాలు
ఇక మనకి మనం చక్కిలిగింతలు పెట్టుకోలేం. మెదడు వెనుక భాగంలో ఉన్న చిన్న మెదడు మీకు మీరే కితకితలు పెట్టుకోబోతున్నారని ముందుగానే మెదడుకి సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల మెదడు సరైన సంకేతాలు ఇవ్వదట. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. పిల్లల్ని ఆట పట్టిస్తూ చక్కిలిగింతలు పెడతారు. వారిలో నవ్వడం నేర్పడానికి అలా చేస్తారు. నవ్వు అనేది ఒక అంటువ్యాధిలా అంతటా ఆవరిస్తుంది. ఒకరు నవ్వడం ప్రారంభిస్తే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా నవ్వుతారు. నవ్వు వల్ల సమాజంలో మంచి సానుకూల బంధాలు ఏర్పడతాయి.