Revanth Reddy: రైతులు, విద్యార్థులే తెలంగాణకు యజమానులు: రేవంత్ రెడ్డి

తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.

Revanth Reddy: రైతులు, విద్యార్థులే తెలంగాణకు యజమానులు: రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణకు అసలైన యజమానులు రైతులు, విద్యార్థులే అని, తెలంగాణ ఉద్యమంలో వాళ్లదే కీలక పాత్ర అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేళ్లలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది కూడా వాళ్లే అని చెప్పారు రేవంత్. మంగళవారం 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాహల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ భవిష్యత్ వంటి అంశాలపై స్పందించారు. ‘‘రైతులు, విద్యార్థులు కేసీఆర్ కుటుంబం చేతిలో దోపిడీకి గురయ్యారు. రైతులు ఎక్కువగా నష్టపోయారు. అందుకే వరంగల్‌లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తాం.

Rahul Tour in OU: ఓయూ చుట్టూ కాంగ్రెస్ రాజకీయాలు..!

ఇది కాంగ్రెస్ సభ కాదు. రైతుల సభ. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించబోతున్నారు. తెలంగాణ వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీ ప్రాభవం కోల్పోయింది. నిధులు రావడం లేదు. యూనివర్సిటీ శిథిలావస్థలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి సమస్యలు తెలుసుకుని, పార్లమెంటులో ప్రస్తావించాలని విద్యార్థులు కోరినందుకే రాహుల్ ఉస్మానియాలో పర్యటించబోతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణలో ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం వచ్చింది.

వడ్ల గురించి ఇంతకుముందు కేసీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించలేదు? కేంద్రం నిధులు ఇవ్వట్లేదని ఇన్నాళ్లూ ఎందుకు అడగలేదు? కేసీఆర్ థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగినా స్పందన లేదు. తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పోటీపడాలి.

Rahul OU Tour : ఓయూలో రాహుల్ పర్యటనపై రిజిస్ట్రార్‌ లేఖ..అనుమతి నిరాకరణకు కారణాలు వెల్లడి

త్వరలో విద్యార్థులు, యువతకు సంబంధించి పార్టీ విధానాల్ని స్పష్టం చేయబోతున్నాం. ఆ తర్వాత మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు సంబందించిన విధానాల్ని ప్రకటిస్తాం. తర్వాత పరేడ్ గ్రౌండ్ నుంచి కేసీఆర్‌పై ధర్మయుద్ధం ప్రకటిస్తాం. పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ నేపాల్‌లో పబ్బులో కనిపించడంపై బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కూడా రేవంత్ స్పందించారు. రాహుల్ వెళ్లింది ఒక వివాహ కార్యక్రమానికి అని, అక్కడ ఆయన చైనా రాయబారితో కలిసి కనిపించారన్నారు. అందులో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించబోయే సభ, ఇప్పటివరకు టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సభలకంటే గొప్పగా ఉంటుందని చెప్పారు.