RGV : వివాదంలో ఆర్జీవీ ‘డేంజెరస్’ మూవీ.. సుప్రీంకోర్టుని అవమానిస్తున్నారన్న వర్మ

తాజాగా ఈ డేంజరస్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆర్జీవీ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాని PVR సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ వాళ్ళ థియేటర్లలో ప్రదర్శించడానికి తిరస్కరించాయి.

RGV : వివాదంలో ఆర్జీవీ ‘డేంజెరస్’ మూవీ.. సుప్రీంకోర్టుని అవమానిస్తున్నారన్న వర్మ

Rgv

 

Dangerous :  సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ తన సినిమాలతోనో, తన ట్వీట్స్ తోనో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆర్జీవీ ‘డేంజరస్’ అనే మూవీని తీశారు. ఒక లెస్బియన్ లవ్ స్టోరీతో యాక్షన్, క్రైం అంశాలని కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి మెయిన్ లీడ్స్ లో నటించారు. ‘డేంజరస్’ సినిమాని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించి ఇప్పటికే ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ డేంజరస్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆర్జీవీ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాని PVR సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ వాళ్ళ థియేటర్లలో ప్రదర్శించడానికి తిరస్కరించాయి. దీంతో ఈ వివాదంపై ఆర్జీవీ ట్విట్టర్లో స్పందించారు. ఈ వివాదంపై ట్వీట్ చేస్తూ.. ”నా సినిమా డేంజరస్ ని లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం LGBT కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నారు. PVR, ఐనాక్స్ యాజమాన్యాలు LGBTని వ్యతిరేకిస్తున్నారు. LGBT కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. వారి వ్యతిరేక LGBT, మానవ హక్కులను అవమానించడమే” అని పోస్ట్ చేశారు.

Lock Upp : షారుఖ్, ప్రియాంక, రణవీర్ వీళ్లంతా ఫెయిల్.. మరోసారి బాలీవుడ్ మాఫియా అంటూ కంగనా వ్యాఖ్యలు..

మరి ఈ సినిమాని PVR, ఐనాక్స్ లు ప్రదర్శిస్తాయా లేదా చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఆర్జీవీ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.